Moviesకృతీస‌న‌న్ క్లీవేజ్ షో వెన‌క ఇంత ప్లాన్ ఉందా...!

కృతీస‌న‌న్ క్లీవేజ్ షో వెన‌క ఇంత ప్లాన్ ఉందా…!

గత కొంతకాలంగా బాలీవుడ్ హీరోయిన్స్ కూడా సౌత్‌లో మరీ ముఖ్యంగా తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోయిన్‌గా వెలగాలనుకుంటున్నారు. అందుకే మన సౌత్ నుంచి ఆఫర్ వస్తే రెమ్యునరేషన్ బాలీవుడ్ సినిమా కంటే తక్కువ ఉన్నా కూడా ఒప్పుకుంటున్నారు. మన టాలీవుడ్‌లో వరుసగా హిట్స్ వస్తే ఒక్కో సినిమాకి రెమ్యునరేషన్ భారీగా పెంచే నిర్మాతలున్నారు.

 

అందుకే, ఇక్కడ స్టార్ స్టేటస్ కోసం అన్నీ భాషలలోని హీరోయిన్స్ వచ్చి పాగా వేస్తుంటారు. కానీ, అందరూ ఆ స్థాయిలో సక్సెస్ సాధించలేరు. అయితే, కొందరు హీరోయిన్స్ మాత్రం ఎప్పటికైనా మన తెలుగులో అగ్ర కథానాయికగా అగ్ర తాంబూలం అందుకోవాలని కసితో ఉంటారు. అలాంటి వారిలో కృతి సనన్ ఒకరని చెప్పాలి. సుకుమార్ సినిమా అంటే హీరోయిన్ పాత్రకి మంచి ప్రాముఖ్యత ఉంటుందని మొదటి సినిమా నుంచే నిరూపణ అయింది.

ఆర్య సినిమాలో కథ మొత్తం హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంది. ఆ తర్వాత వచ్చిన ఆర్య 2 కూడా అంతే. రంగస్థలం..పుష్ప లాంటి సినిమాలలో హీరోయిన్ పాత్ర ఎంత బలంగా ఉంటుందో ఆ హీరోయిన్‌కి వచ్చిన పొగడ్తతోనే తెలుస్తుంది. సమంత, రష్మిక మందన్న లాంటి వారికి సుకుమార్ ఇచ్చిన మైలేజ్ అసాధారణం. కానీ, సుకుమార్-సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన 1 నేనొక్కడినే సినిమాతో పరిచయమైన కృతి సనన్ తెలుగులో అడ్రస్ లేకుండా పోయింది.

ఇక్కడ రెండు సినిమాలు చేసిన ఎవరూ పట్టించుకోలేదు. బాలీవుడ్‌లో మాత్రం అమ్మడు బిజీ ఆర్టిస్ట్. ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమా ఆదిపురుష్‌లో సీతగా నటిస్తోంది. అయినా క్లీవేజ్ షోలతో మంటరేపుతోంది. ఇలాంటి ఘాటు అందాలను ఆరబోస్తూ చేస్తున్న ఫొటో షూట్స్ కృతీ సనన్‌ని ఎంతవరకూ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news