Moviesబాలీవుడ్ కి ఆ హీరో..టాలీవుడ్ కి ఈ హీరో..ఒక్క దెబ్బతో ఫ్యాన్స్...

బాలీవుడ్ కి ఆ హీరో..టాలీవుడ్ కి ఈ హీరో..ఒక్క దెబ్బతో ఫ్యాన్స్ నోర్లు మూయించిన నాగార్జున..!!

ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ ని కావాలనే ఓ పని పాట లేని బ్యాచ్ బాగా టార్గెట్ చేస్తుంది. ఒక బ్యాచ్ దారుణాతి దారుణంగా తారక్ పై నిందలు వేస్తూ మాట్లాడుతుంది . ఆయన ప్రమేయం ఉన్నా లేకపోయినా కావాలనే ఆయనపై ఏదో ఒక విషయం కారణంగా నిందలు వేస్తూ వస్తున్నారు. అయితే ఇలాంటి క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ కూడా అలాంటి వాళ్లకు ఇచ్చిపడేస్తున్నారు . ప్రసెంట్ దానికి సంబంధించిన కొన్ని విషయాలను ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.

కాగా రీసెంట్గా విరాట్ కోహ్లీ తారక్ ను ఓ రేంజ్ లో పొగిడేసాడు అన్న వీడియోని సోషల్ మీడియాలో జనాలు ఏవిధంగా ట్రెండ్ చేశారో మనం చూసాం. ఇప్పుడు అక్కినేని నాగార్జున అలా ఎన్టీఆర్ ని పొగిడేసిన వీడియోని కూడా ట్రెండ్ చేస్తున్నారు. గతంలో ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ.. అక్కినేని నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ని రేంజ్ లో పొగిడేస్తాడు . “బాలీవుడ్ ఇండస్ట్రీకి అమితాబచ్చన్ ఎలాగో టాలీవుడ్ ఇండస్ట్రీకి జూనియర్ ఎన్టీఆర్ అలా అంటూ బాగా పొగుడుతాడు”.

“బాలీవుడ్ ఇండస్ట్రీలో అమితాబచ్చన్ బాగా డైలాగ్స్ చెప్తాడు..అది అందరి తెలుసు..ఎలా అంటే.. ఎంత పెద్ద పేజీల డైలాగ్స్ అయినా సరే సింగిల్ టేకులో ఫినిష్ చేస్తాడు.. టాలీవుడ్ లో అలాంటి హీరోస్ చాలా తక్కువ.. వాళ్ళల్లో ఒకరే జూనియర్ ఎన్టీఆర్ “అంటూ తేల్చి చెప్పేసాడు అక్కినేని నాగార్జున. ఇలాంటి స్టార్ మన ఇండస్ట్రీలో ఉండటం గర్వకారణం అంటూ కూడా చాలా బాగా చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. మొత్తానికి తారక్ ని టార్గెట్ చేసిన జనాలకు ఫ్యాన్స్ బాగానే కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news