Movies"ప్రాణం పోయినా శుక్రవారం ఆ పని మాత్రం చేయను".. ఒక్క మాటతో...

“ప్రాణం పోయినా శుక్రవారం ఆ పని మాత్రం చేయను”.. ఒక్క మాటతో ఫ్యాన్స్ ను ఫిదా చేసేసిన జాన్వి కపూర్..!!

జాన్వి కపూర్ ..ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా మారుమ్రోగి పోతున్న పేరు . ఆఫ్ కోర్స్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అతిలోకసుందరిగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీదేవి ముద్దుల కూతురి అయినప్పటికీ సినిమాల్లో నటించినప్పటికీ రాని క్రేజ్ సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండడంతో తనదైన స్టైల్ లో ఫోటోషూట్స్ చేసి అభిమానలను కుర్రాళ్లను అట్రాక్ట్ చేయడంతో జాన్వి కపూర్ పేరు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూనే టాలీవుడ్ లోనూ లక్ పరీక్షించుకోవడానికి సిద్ధమైంది జాన్వికపూర్ . కాగా జాన్వీ కపూర్ తాజాగా నటించిన సినిమా మిస్టర్ అండ్ మిసెస్ మహి. ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది జాన్వి కపూర్ . కాగా జాన్వి కపూర్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ తన తల్లికి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంది. అంతేకాదు తన తల్లి చనిపోయినా శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ హెయిర్ కట్ చేయించుకొని ..బ్లాక్ డ్రెస్ ధరించను అని చెప్పుకొచ్చింది.

వాళ్ళ అమ్మగారు తనకి చిన్నప్పటి నుంచి అదే నేర్పించారు అని ..కానీ ఆమె బతికున్నప్పుడు నాకు అలా చేయాలి అని అనిపించలేదు అని ..అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ కోసం అమ్మకు నచ్చినట్లు మారాను అని అమ్మ మొదటి నుంచి సంస్కృతి సాంప్రదాయాలను ఎక్కువగా ఫాలో అవుతుంది అని ..అందుకే శుక్రవారం హెయిర్ కట్ చేసుకున్న బ్లాక్ డ్రెస్ వేసుకున్న మహాలక్ష్మి ఇంట్లోకి అడుగుపెట్టదు అంటూ చెప్పుకోచేదట.

అప్పట్లో అవి సిల్లీగా అనిపించినా ఇప్పుడు మాత్రం చాలా కాన్సన్ట్రేషన్ గా ఫాలో అవుతున్నాను అని.. ఇప్పటికీ నేను శుక్రవారం పూట బ్లాక్ డ్రెస్ వేసుకొను అని.. హెయిర్ కట్ చేయించను అని అంటూ చెప్పుకు వచ్చింది . దీంతో శ్రీదేవి ఫ్యాన్స్ జాన్వి కపూర్ మాటలకు ఫిదా అయిపోతున్నారు . ఆమె మాటలను ట్రెండ్ చేస్తున్నారు . గుడ్ ఇలానే ఉండు మంచి స్టార్ హీరోయిన్గా ఎదుగుతావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news