Moviesపవన్ తో ప్రభాస్ మల్టీ స్టారర్ మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే...

పవన్ తో ప్రభాస్ మల్టీ స్టారర్ మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే రోమాలు నిక్కబొడుచుకుని డ్యాన్స్ చేస్తాయి..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ ల మూవీ ల ట్రెండ్ ఎలా ముందుకు వెళ్తుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా బడాబడా పాన్ ఇండియా స్టార్స్ కూడా మల్టీ స్టార్లర్ మూవీలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . రీసెంట్గా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఓ బిగ్ బడా మల్టీస్టారర్ మూవీ రాబోతుంది అన్న ప్రచారం ఊపొందుకుంది. దానికి కారణం ఓ ఇంటర్వ్యూలో భాగంగా డైరెక్టర్ సుజిత్ చేసిన కామెంట్స్ అంటూ తెలుస్తుంది .

సుజిత్.. సాహో సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. యంగ్ డైరెక్టర్ కానీ చాలా ఎక్స్పీరియన్స్ గా సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు. రీసెంట్గా కార్తికేయతో “భజే వాయువేగం” మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా ఓజీ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చాడు . అంతేనా తన మనసులోని కోరికను బయటపడుతూ సంచలన కామెంట్స్ చేశారు. “పవన్ కళ్యాణ్ – ప్రభాస్లతో ఒక బిగ్ మల్టీస్టారర్ చేయాలని ఉంది ” అంటూ తన కోరికను బయటపెట్టేసాడు .

“అది ఎంతవరకు ముందుకెళ్తుందో తెలియదు కానీ.. నేనైతే చాలా చాలా కష్టపడుతున్నాను ఆ మూవీ రావడానికి అంటూ చెప్పుకొచ్చాడు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. నిజంగా ప్రభాస్ పవన్ కళ్యాణ్ కాంబోలో మల్టీ స్టారర్ వస్తే మాత్రం అది కెవ్వు కేక ..రచ్చరంబోలానే అంటూ పోగిడేస్తున్నారు . అంతేకాదు ఓజీ గురించి సుజిత్ మాట్లాడుతూ..” పవన్ కళ్యాణ్ ఇందులో వింటేజ్ లుక్ లో కనిపిస్తారు అని .. ఇప్పటివరకు ఫ్యాన్స్ చూడని సరికొత్త గెటప్ లో పవన్ కళ్యాణ్ ని చూడబోతున్నారు అని చెప్పుకొచ్చారు”. ప్రభాస్ – పవన్ కళ్యాణ్ లపై చేసిన సుజిత్ చేసిన కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news