Moviesటెలివిజన్ చరిత్రలోనే ఫస్ట్ టైం .. అన్ స్టాపబుల్ లో ఆది...

టెలివిజన్ చరిత్రలోనే ఫస్ట్ టైం .. అన్ స్టాపబుల్ లో ఆది పురుష్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో..!!

ఎస్ ఇది నిజంగా రెబెల్ – నందమూరి ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ అని చెప్పలి. ఇప్పటివరకు అన్ స్టాపుల్ షో కి ఎంతోమంది ప్రముఖులు వచ్చిన ఎపిసోడ్స్ మనం చూశాం . కాగా బాలకృష్ణ సైతం వాళ్ళతో సరదాగా ఆడి పాడి అలరించి తనదైన స్టైల్ లో హోస్ట్ చేసి షో ని మరింత ముందుకు తీసుకెళ్లాడు. కాగా ఫర్ ద ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్ లో సంపాదించుకున్నాక బుల్లితెరపై మెరవబోతున్నాడు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ . దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ని ఆహా అధికారికంగా ప్రకటించింది .

నందమూరి నట సింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్. మొదటి సీజన్ సూపర్ డూపర్ హిట్ అవడంతో రెండో సీజన్ పై భారీ అంచనాలు పెట్టుకొని ఉన్నారు నందమూరి ఫ్యాన్స్ . ఈ క్రమంలోనే ఇప్పటివరకు స్ట్రీమింగ్ అయిన అన్ని ఎపిసోడ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి . కాగా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షోలో త్వరలోనే పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. ప్రభాస్ గెస్ట్ గా రాబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించింది ఆహా.

దీనికి సంబంధించిన న్యూస్ గత రెండు వారాలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అయితే అందరు ఫేక్ అనుకున్న ఈ న్యూస్ పై కొద్దిసేపటి క్రితమే ఆహా అధికారిక ప్రకటన చేయడంతో రెబల్ – నందమూరి ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్లు ఊగిపోతున్నారు. ప్రస్తుతం ఈ స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. త్వరలోనే పూర్తి ఎపిసోడ్ రాబోతుంది అంటూ అధికారికంగా ప్రకటించింది ఆహా . దీంతో ప్రభాస్ ఫాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. చూడాలి మరి ఈ టాక్ షోలో ప్రభాస్ ఎలా మాట్లాడాడో ..తన పెళ్లి గురించి ఏ విధంగా క్లారిటీ ఇచ్చాడో..?

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news