Moviesయస్..నేను మహేశ్ ఆ డీల్ ప్రకారమే పెళ్లి చేసుకున్నాం..సంచలన విషయాని బయటపెట్టిన...

యస్..నేను మహేశ్ ఆ డీల్ ప్రకారమే పెళ్లి చేసుకున్నాం..సంచలన విషయాని బయటపెట్టిన నమ్రత..!!

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే ..ఆమె పేరు తెలియని వారు అంటూ ఉండరు . 1993లో మిస్ ఇండియా గా ఎన్నికైన ఆమె 2000 సంవత్సరంలో వంశీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది . మొదటి సినిమాతోనే మహేష్ బాబుతో జతకట్టిన అందాల ముద్దుగుమ్మ ..ఆ సినిమా షూట్ చేస్తున్న టైంలోనే వీళ్లిద్దరూ మధ్య ప్రేమ చిగురించింది .

కాగాగా ఆ ప్రేమను అలా అలా కంటిన్యూ చేస్తూ 2005 లో ఒకటయ్యారు . వంశి సినిమా షూటింగ్ టైంలో ఒకరినొకరు ఇష్టపడ్డ ఈ జంట దాదాపు ఐదేళ్లు గుట్టుచప్పుడు కాకుండా తమ ప్రేమాయణాన్ని కంటిన్యూ చేశారు . ఆ తర్వాత ఒక మంచి ముహూర్తం చూసి ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు . వీళ్ల పెళ్ళి చాలా సింపుల్గా జరిగింది . కాగా వీళ్ళకి ఇప్పుడు ఇద్దరు పిల్లలు గౌతం, సితార . ఈ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది .

కాగా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నమ్రత తన ఫ్యామిలీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది . అంతేకాదు తన పెళ్లి ప్రెగ్నెన్సీ మహేష్ తో తన ప్రేమ విషయాన్ని ఓపెన్ గా చెప్పేసింది . ఈ క్రమంలోనే మహేష్ నేను ప్రేమించుకున్నప్పుడే ఒక డీల్ కుదుర్చుకున్నామని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది .

ఆమె మాట్లాడుతూ..” నేను మహేష్ వంశి సినిమా షూటింగ్ టైంలోనే క్లోజ్ అయ్యాం. అప్పుడే ప్రేమించుకుంన్నాం. ఆ తర్వాత నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఓ డీల్ ని కుదుర్చుకున్నాం. పెళ్లి తర్వాత నేను సినిమాలు చేయకూడదు హీరోయిన్గా నటించకూడదు అని సింపుల్ గా హౌస్ వైఫ్ లానే ఉండాలి ఓ భార్యగా.. ఓ తల్లిగా ..ఓ కోడలిగా నా బాధ్యతలను నెరవేర్చుకోవాలి నాకు అదే ఇష్టం ఇదే విషయం మహేష్ కూడా చెప్పాడు . దీంతో నాకు చాలా హ్యాపీ అనిపించింది “అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే నమ్రత చేసిన కామెంట్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి . అంతేకాదు స్టార్ హీరోయిన్గా ఉన్న నువ్వు ఇప్పుడు సింపుల్ గా ఇంటి ఇల్లాలుగా ఉండడం చాలా హ్యాపీగా ఉంది అంటూ ఆమెను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్ . అంతేకాదు చాలామంది హీరోయిన్లు ఈమెను చూసి నేర్చుకోవాలి అంటూ పరోక్షంగా కొందరు హీరోయిన్స్ ని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news