Moviesఇష్టమైన హీరో కోసం.. కాజల్ సంచలన నిర్ణయం..నిజమైన అభిమానం అంటే ఇదేగా..!?

ఇష్టమైన హీరో కోసం.. కాజల్ సంచలన నిర్ణయం..నిజమైన అభిమానం అంటే ఇదేగా..!?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ..తన ఫేవరెట్ హీరో కోసం షాకింగ్ నిర్ణయం తీసుకుందా ..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు. మనకు తెలిసిందే మొదటి ఇన్నింగ్స్ లో సూపర్ స్టార్ హీరోయిన్ గా తెలుగు-తమిళ్-హిందీ సినిమాలలో నటించి తనకంటూ స్పెషల్ గుర్తింపు సంపాదించుకుంది. లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కాజల్.. ఆ తర్వాత మగధీర సినిమాతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది .

కెరీర్ పీక్స్ లో ఉండ గానే పెళ్లి చేసుకున్న కాజల్ ..అంతే త్వరగా నీల్ కిచ్చులు కి జన్మనిచ్చి అమ్మ తనాన్ని ఎంజాయ్ చేస్తుంది. కాగా ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ ను జెట్ స్పీడ్ లో ముందుకు దూసుకెళ్తున్న కాజల్ తన ఫేవరెట్ హీరో తారక్ కోసం మళ్ళీ ఐటమ్ గర్ల్ గా మారింది అంటూ తెలుస్తుంది . మనకు తెలిసిందే టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే కొరటాల శివ డైరెక్షన్లో ఓ సినిమాలు నటించబోతున్నాడు.

ఆయన కెరియర్లో 30వ చిత్రం గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక మందన, మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ల గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది . కాక ఇదే సినిమాలో ఐటెం సాంగ్ పాత్ర కోసం కాజల్ అగర్వాల్ సంప్రదించాడట కొరటాల . గతంలో ఆయనతో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా ఆయన అడగగానే నో చెప్పలేక ఎస్ చెప్పినట్లు తెలుస్తుంది . అంతేకాదు కాజల్ కి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం .

 

పలు ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది . ఆయనతో కలిసి నటించే ఛాన్స్ వస్తే వదులుకోను అంటూ చెప్పుకొచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆమె పేరు సంచలనంగా మారింది. ఏది ఏమైనా సరే కాజల్ తీసుకున్న నిర్ణయం సూపరో సూపర్ అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. ఇదివరకే పక్కా లోకల్ అంటూ ఇరగదీసింది ఈ కాంబో,, మరి ఈసారి ఎలాంటి మాస్ మసాలా బీట్ తో దుమ్ము లేపుతారు చూడాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news