Moviesఅలా చేసినందుకు అడ‌వి శేష్‌ను కొట్టిన బాల‌య్య‌... !

అలా చేసినందుకు అడ‌వి శేష్‌ను కొట్టిన బాల‌య్య‌… !

నందమూరి నటసింహం బాలకృష్ణ అన్‌స్టాప‌బుల్ షోతో బుల్లితెరను షేక్ చేసి పడేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ లో టాప్ సెలబ్రిటీలు సైతం ఇప్పుడు బాలయ్య టాక్ షోకు గెస్టులుగా వెళ్లాలన్న ఆతృతతో ఉన్నారు. మామూలుగా ఏ టాక్ షోలోకి అయినా గెస్ట్ లను ఆహ్వానిస్తారు. అయితే బాలయ్య టాక్ షోలోకి వెళ్లేందుకు ఇండస్ట్రీ సెలబ్రిటీలే వారంత‌ట వారే స్వయంగా బాలయ్యకు ఫోన్లు చేస్తున్నారు. ముఖ్యంగా రెండో సీజన్లో యంగ్ హీరోలను తీసుకువచ్చి బాలయ్య చేసిన రచ్చ అంత ఇంతా కాదు.

అడవి శేషు – జొన్నలగడ్డ సిద్దు – విశ్వక్సేన్ – శర్వానంద్‌ లాంటి క్రేజీ కుర్ర హీరోలతో బాలయ్య ఓ ఆటాడుకున్నాడు. రీసెంట్‌గా అడవి శేష్‌ హిట్ 2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించాడు. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా తెర‌కెక్కిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. డిసెంబర్ 2న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

నిర్మాతగా నానికి అదిరిపోయే లాభాలు తెచ్చిపెట్టింది. కొడుకు మోక్షజ్ఞతో కలిసి బాలయ్య ఈ హిట్‌-2 సినిమాను చూసి హీరో అడ‌వి శేష్‌తో పాటు ద‌ర్శ‌కుడు శైలేష్‌ను మెచ్చుకున్నాడు. సినిమా చూసి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు బాల‌య్య త‌న‌ను కొట్టారంటూ శేష్ ఇప్పుడు చెప్ప‌డం వైర‌ల్ గా మారుతోంది. సినిమా చూసి బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ప్పుడు బాల‌య్య చేయి చాచార‌ట‌… షేక్ హ్యాండ్ ఇస్తున్నారేమో అని శేష్ చేయిచాచ‌గా… బాల‌య్య వెంట‌నే ఆ చేతిపై ఒక్క‌టి కొట్టడంతో సినిమా బాగోలేదేమో అని శేష్ షాక్ అయిపోయాడ‌ట‌.

ఆ త‌ర్వాత ప‌క్క‌నే ఉన్న ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌న‌ను ఆలింగం చేసుకుని మెచ్చుకున్న బాల‌య్య.. ఆ త‌ర్వాత శేష్‌ను ఏకంగా ఐదుసార్లు ఆలింగం చేసుకుని సినిమా చాలా బాగా న‌చ్చింద‌ని ప్ర‌శంస‌ల‌కు కురిపించార‌ట‌. ఈ విష‌యాన్ని శేష్ తాజా ఇంట‌ర్వ్యూలో స్వయంగా చెప్పారు. చాలా ప్యూర్ అబ్బా.. చాలా మంచి మ‌న‌సున్న వ్య‌క్తి అంటూ శేష్ కితాబు ఇచ్చాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news