Moviesసీనియ‌ర్ హీరోయిన్ రాధ భ‌ర్త ఎవ‌రు.. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న...

సీనియ‌ర్ హీరోయిన్ రాధ భ‌ర్త ఎవ‌రు.. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఆమె సడెన్ ఎంట్రీ వెన‌క ఏం జ‌రిగింది ?

నిన్నటి తరం సీనియర్ హీరోయిన్ రాధా అంటే తెలుగు ప్రేక్షకుల మదిలో ఎన్నో జ్ఞాపకాలు మెదులుతాయి. రాధా రాధా మదిలోనే మన్మథ‌ బాధ అంటూ ఎన్నో పాత‌ పాటలు మన కళ్ళ ముందు కదలడుతూ ఉంటాయి. రాధ‌ దక్షిణాదిలో ప్రతి హీరో పక్కన హీరోయిన్‌గా చేసింది. అప్పట్లో ఆమె విజయశాంతి లాంటి స్టార్ హీరోయిన్లతో పోటీపడి మరి నటించింది. చిరంజీవి- రాధ‌ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్‌. చిరంజీవి సైతం స్వయంగా ఎన్నోసార్లు రాధ‌ పక్కన నటించాలంటే ఆమె ఎనర్జీ చూసి నాకు కాస్త టెన్షన్ అంటు స్వయంగా చెప్పారంటే రాధ‌ టాలెంట్ ఎలాంటిదో అర్థమవుతుంది.

రాధ‌ అక్క అంబిక. ఒకానొక దశలో తెలుగు, తమిళ సినిమాలను ఈ ఇద్దరు అక్కచెల్లెళ్లు కలిసి ఏలేశారు. రాధ‌ స్వతహాగా మలయాళీ అమ్మాయి. మొదటి సినిమా మొద‌ల్ మ‌ర్యాదై సినిమాలో రాధ త‌న న‌ట‌న‌తో ఎన్నో ప్ర‌సంప‌లు అందుకుంది. కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో ఉన్నప్పుడే తన బంధువు అయినా మణి అనే వ్యక్తితో రాధకు పెళ్లయిపోయింది. మణి ఇప్పుడు ముంబైలో ప్రముఖ వ్యాపారవేత్త. పెళ్లయ్యాక రాధ సినిమాలకు పూర్తిగా దూరమైంది.

ముంబైలో ఒక ప్రముఖ రెస్టారెంట్ కూడా నిర్వహిస్తోంది. రాధ కూతురు కార్తీక కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. అయినా ఆమెకు గుర్తింపు రాలేదు. చివరకు కూతురు కోసం రాధా స్వయంగా రంగంలోకి దిగి జూనియ‌ర్‌ ఎన్టీఆర్ తో రెకమండ్‌ చేయించుకుని దమ్ము సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ ఇప్పించుకుంది. ఆ సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత కార్తీక, అల్లరి నరేష్ సినిమాలలో సోదరి పాత్ర స్థాయికి పడిపోయింది.

రాధ మరో కుమార్తె తులసి సైతం హీరోయిన్ గా వచ్చింది. ఆమె తొలి సినిమా డిజాస్టర్ కావడంతో ఆమెను ఎవరు పట్టించుకోలేదు. రాధకు ఇద్దరు కుమార్తెలతో పాటు ఒక కొడుకు కూడా ఉన్నాడు. రాధ ఇప్పుడు మెయిన్‌స్ట్రీమ్‌ మీడియాకు దూరం అయిపోయింది. అసలు బుల్లితెరపై ఆమె ఎప్పుడు కనపడలేదు. అయితే హఠాత్తుగా ఆమె బిగ్ బాస్ 6 సీజన్లో ఒక గెస్ట్ గా దర్శనం ఇచ్చింది. ఆమె ఎందుకు ? సడన్‌గా ఎంట్రీ ఇచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు.

అయితే దీని వెనక ఓ ప్లానింగ్ ఉంది. స్టార్ మా వాడు బీబీ జోడి అంటూ ఓషో కొత్తగా ప్లాన్ చేశాడు. దీని లాంచింగ్‌కు నాగార్జున గెస్ట్. ఆ షోలో రాధ జడ్జిగా ఉండబోతోంది. పాత సినిమాల్లో నాగార్జున – రాధ‌ కలిసి రొమాన్స్ చేశారు. ఆ షూటింగ్ కోసం వచ్చిన రాధ‌ను బిగ్ బాస్ ఫైనల్ కూడా పట్టుకొచ్చాడు నాగార్జున. ఇటు బీబీ జోడీకి ప్రమోషన్ తో పాటు అటు బిగ్‌బాస్ కు గెస్ట్ గా వచ్చారు.

అలా రాధ‌ ఎట్టకేలకు ఇప్పుడు సడన్ గా తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ కొత్త షోకు గతంలో ఈటీవీ ఢీ షోకు జడ్జిగా పనిచేసిన హీరోయిన్ సదా ఒక జడ్జి కాగా… రాధ మరో జడ్జిగా రాధ వ్యవహరించబోతున్నారు. మరి రాధ తెలుగు బుల్లితెర ప్రయాణం ఎలా ? ఉంటుందో చూడాలి

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news