Moviesబాల‌య్య - ప్ర‌భాస్ క‌లిస్తే వాళ్ల‌కు ఫ్యాంట్లు త‌డిచిపోతున్నాయ్‌గా... ర‌చ్చ ఈ...

బాల‌య్య – ప్ర‌భాస్ క‌లిస్తే వాళ్ల‌కు ఫ్యాంట్లు త‌డిచిపోతున్నాయ్‌గా… ర‌చ్చ ఈ రేంజ్‌లో ఉంటుందా…!

నటసింహం నందమూరి బాలకృష్ణ సెలబ్రిటీ టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె సీజన్ 2 గ్రాండ్ సక్సెస్ తో దూసుకుపోతోంది. రెండో సీజన్‌లో ఫస్ట్ ఎపిసోడ్ చంద్రబాబు, లోకేష్ ఎంట్రీ తోనే ఈ షోకు అదిరిపోయే క్రేజ్ వచ్చేసింది. ఆ తర్వాత నలుగురు యంగ్ హీరోలుతో చేసిన రెండు ఎపిసోడ్‌లు కూడా దుమ్ములేపేసాయి. ఇక టాలీవుడ్ చరిత్రలోనే తిరుగులేని క్రేజ్ ఉన్న సీనియర్ దర్శకులు కే రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి తో పాటు ఇద్దరు స్టార్ ప్రొడ్యూసర్లు అల్లు అరవింద్, సురేష్ బాబుతో కలిసి చేసిన ఐదో ఎపిసోడ్ అదిరిపోయింది.

ఇక బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్‌గా తిరిగిలేని స్టార్డం తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – మ్యాచోస్టార్ గోపీచంద్ కాంబినేషన్లో వస్తున్న‌ ఈ ఎపిసోడ్ ప్రోమో ఇప్పటికే రిలీజ్ అయింది. న్యూ ఇయర్ కానుకగా స్ట్రీమింగ్ కానున్న ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు అందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు ఆహాలో క్రియేట్ చేసిన పాత యూట్యూబ్ రికార్డులను బ్రేక్ చేసి పడేసింది.

నటసింహం బాలకృష్ణ- యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కలిస్తే ఏ రేంజ్‌లో ? రచ్చ జరుగుతుందో జస్ట్ శాంపిల్ గా ఈ ఎపిసోడ్ ప్రూవ్ చేసింది. ఈ ప్రోమో ఇప్పటికే 1.5 మిలియన్ల లైకులకు పైగా చేరువైంది. అలాగే 1.3 కోట్లకు పైగా డిజిటల్ వ్యూస్ కూడా సొంతం చేసుకుంది. అలాగే, #PrabhasOnAha హ్యాష్ ట్యాగ్‌తో 1 లక్షకు పైగా ట్వీట్లు ట్విట్టర్‌లో పోస్ట్ చేయ‌బ‌డ్డాయంటేనే ఈ ప్రోమో ఎంత‌లా ? దుమ్మురేపుతోందో అర్థ‌మ‌వుతోంది.

ఈ రికార్డులన్నీ కేవలం ప్రోమోవి మాత్రమే. రేపు పూర్తి ఎపిసోడ్ వచ్చాక ఇది కనీవిని ఎరిగిన రేంజ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందన్న అంచనాలు అయితే వచ్చేసాయి. బాలయ్య – ప్రభాస్ కలిసి ఈ రేంజ్ లో రచ్చ చేస్తుండడంతో బాలయ్యను, బాలయ్య టాక్ షోను ట్రోల్ చేసే వాళ్ళ ప్యాంట్లు తడిచిపోతున్నాయంటూ బాలయ్య ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. కొందరు హీరోల అభిమానులు కూడా పదేపదే బాలయ్యను టార్గెట్‌గా చేసుకొని సెటైర్లు వేయటం మామూలు అయింది.

అయితే అన్‌స్టాప‌బుల్ షోతో వాళ్లకు బాలకృష్ణ దిమ్మతిరిగే రేంజ్ లో సమాధానం ఇచ్చారు. ఇక ఇప్పుడు ప్రభాస్ తో కలిసి చేసిన ఈ రచ్చ ట్విట్టర్ ను సైతం షేక్ చేస్తుండడంతో వాళ్ల నోటికి పూర్తిగా ప్లాస్టర్లు పడిపోయాయి. ఇక ఎపిసోడ్ తర్వాత సంక్రాంతికి బాలయ్య వెటర‌న్‌ హీరోయిన్లు జయసుధ, జయప్రదతో పాటు యంగ్ హీరోయిన్ రాశీఖ‌కన్నాతో కలిసి మరో ఎపిసోడ్‌తో అలరించనున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news