Movies"ఆగ్ లగా దేంగే"..రౌడి హీరో పంచ్ అద్దిరిపోయిందిగా..ఇచ్చిపడేసాడు..!!

“ఆగ్ లగా దేంగే”..రౌడి హీరో పంచ్ అద్దిరిపోయిందిగా..ఇచ్చిపడేసాడు..!!

టాలీవుడ్ లో యాటిట్యూడ్ హీరోగా పేరు సంపాదించుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పినా తక్కువే . ఉన్నది ఉన్నట్లు ఫేస్ మీద మాట్లాడే తెలుగు హీరోలు చాలా తక్కువ.. అందులో ఒకరే ఈ హీరో విజయ్ దేవరకొండ . పెళ్లి చూపులు సినిమాతో కూల్ క్లాసి క్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఎవరు ఊహించిన విధంగా అర్జున్ రెడ్డి తో యాటిట్యూడ్ హీరో అని పేరుని నమోదు చేసుకున్నాడు. రీసెంట్ గా రిలీజ్ లో రిలీజ్ అయిన లైగర్ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకొని ఉన్న విజయ్ దేవరకొండ కి ఆ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో తెలిసిందే.

ఆగస్టు 25న భారీ లెవెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ టైంలో విజయ్ దేవరకొండ ని యూత్ ఎక్కువు గా ట్రోల్ చేశారు. కాగా ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయ్ లైగర్ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు . ఆయన మాట్లాడుతూ..” నేను మళ్ళీ తిరిగి ఇక్కడైకి రావాలని అభిమానులు అందరూ కోరుకుంటున్నారు .ప్రతిసారి అడుగుతున్నారు . నేను ఎక్కడికి వెళ్లాను ఇక్కడే ఉన్నాను . ప్రస్తుతం సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నాను . లైగర్ సినిమా ఫ్లాప్అంటున్నారు . కానీ నా వరకు అది ఫ్లాప్ కాదు ఒక నటుడిగా వ్యక్తిగా నేనేంటో నాకు చూపించిన సినిమానే లైగర్ . ఈ సినిమా నా జీవితంలో ఎంత విలువైన పాఠాలు నేర్పించింది” అంటూ చెప్పుకొచ్చాడు.

 

నిజానికి ఏ హీరో అయినా సరే సినిమా ఫ్లాప్ అయితే బయట కనిపించడు . జనాలు ఎక్కడ అదే ప్రశ్నలు అడిగి విసిగిస్తారు అని భయపడి ఇంట్లోనే దాక్కుంటారు. కానీ విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ షో పడి నెగటివ్ టాక్ తెచ్చుకున్న పక్క రోజే క్రికెట్ మ్యాచ్ లో కనిపించి రౌడీ హీరో శభాష్ అనిపించాడు . అంతే కాదు తన సినిమా ఫ్లాప్ అయింది అని ఒప్పుకునే ధైర్యం ఏ హీరోకి ఉండదు . కానీ విజయ్ దేవరకొండ అలాంటి సాహసం చేసి సూపర్ హీరో అనిపించాడు . దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ “ఆగ్ లగా దేంగే” అనే డైలాగ్ ని మళ్ళీ వైరల్ చేస్తున్నారు . అంతేకాదు విజయ్ దేవరకొండ లాంటి హీరోనే ఇండస్ట్రీలో ఉండాలి . సినిమా అన్నాక హిట్లు ప్లాట్లు సర్వసాధారణం. హిట్ కొట్టింది కదా అని వీర్రవీగకూడదు ..ఫ్లాప్ పడింది కదా అని ఏడ్చుకోకూడదు ..ఇలానే లైఫ్ లో ముందుకు వెళ్లాలి” అంటూ చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సరే తనని ట్రోల్ చేసే వారికి విజయ్ దేవరకొండ ఇచ్చి పడేసాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news