Moviesరికార్డుల బ్రేక్‌కు రెడీ అవుతోన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్‌... ఆ హీరోల‌ రికార్డులు...

రికార్డుల బ్రేక్‌కు రెడీ అవుతోన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్‌… ఆ హీరోల‌ రికార్డులు షేకేనా…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మామూలు ఫామ్‌లో లేడు. ఒక‌టా రెండా వ‌రుస‌గా టెంప‌ర్ నుంచి అన్నీ సినిమాలు సూప‌ర్ హిట్టే. ఆరు వ‌రుస హిట్లు… డ‌బుల్ హ్యాట్రిక్‌… పైగా త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్‌. ఇప్పుడు చేతిలు ఉన్న కొర‌టాల శివ‌, ప్ర‌శాంత్ నీల్ రెండు సినిమాలు పాన్ ఇండియా లెవ‌ల్లో వ‌స్తున్న‌వే. దీనిని బ‌ట్టే ఎన్టీఆర్ లైన‌ప్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో తెలుస్తోంది.

 

అయితే ఎన్టీఆర్ త‌న ఫ్యాన్స్‌ను కొన్ని విష‌యాల్లో మాత్రం బాగా డిజ‌ప్పాయింట్మెంట్ చేస్తున్నాడు. 2018 చివ‌ర్లో వ‌చ్చిన అరవింద స‌మేత వీర‌రాఘ‌వ త‌ర్వాత నాలుగేళ్ల పాటు స్క్రీన్ మీద క‌న‌ప‌డ‌లేదు. ఇక ఈ యేడాది మార్చిలో త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. త్రిబుల్ ఆర్‌, క‌రోనా దెబ్బ‌తో నాలుగేళ్ల‌లో ఎన్టీఆర్ ఒక్క సినిమా కూడా రాలేదు. పోనీ ఇప్పుడు అయినా చ‌క‌చ‌కా సినిమాలు చేస్తాడా ? అనుకుంటే అదీలేదు.

త్రిబుల్ ఆర్ రిలీజ్ అయినా ఆరు నెల‌ల నుంచి ఖాళీగానే ఉన్నాడు. కొర‌టాల ఈ సినిమాను ఎప్పుడు ప‌ట్టాలెక్కిస్తాడో ? కూడా అర్థం కావ‌ట్లేదు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ అభిమానుల‌కు మ‌రో ప‌ది రోజుల్లో గుడ్ న్యూస్ రానుంది. ఎన్టీఆర్ న‌టించిన హిట్ సినిమా బాద్ షా న‌వంబ‌ర్ 19న రీ రిలీజ్ చేస్తున్నారు. శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఎన్టీఆర్‌కు జోడీగా న‌టించ‌గా బండ్ల గ‌ణేష్ ఈ సినిమాను నిర్మించారు.

బాద్ షా రీ రిలీజ్ విష‌యాన్ని నిర్మాత న‌ట్టి కుమార్ క‌న్‌ఫార్మ్ చేశారు. టాలీవుడ్‌లో ఇప్పుడు స్టార్ హీరోల బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు రీ రిలీజ్ చేసే ట్రెండ్ కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే మ‌హేష్‌బాబు పోకిరి, ఒక్క‌డు సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇందులో పోకిరి మంచి వ‌సూళ్లు సాధించింది. పోకిరి రీ రిలీజ్ వ‌సూళ్ల‌లో స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేయ‌గా మ‌హేష్ ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకున్నారు.

పోకిరి రికార్డుల‌ను ప‌వ‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్ జ‌ల్సా రీ రిలీజ్‌తో బ్రేక్ చేసింది. జ‌ల్సాకు ఎక్కువ షోలు ప‌డ్డాయి. వ‌సూళ్లు కూడా అలాగే రావ‌డంతో పవ‌న్ ఫ్యాన్స్ సంబ‌రాలు మామూలుగా చేసుకోలేదు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బాద్ షా సైతం రీ రిలీజ్ అవుతుండ‌డంతో బాద్ షాతో స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేసి రచ్చ లేపాల‌ని ఎన్టీఆర్ అభిమానులు ఉత్సాహంతో ఉన్నారు. ఇంత‌కు ముందు రీ రిలీజ్ అయిన స్టార్ హీరోల సినిమాల వ‌సూళ్ల‌ను బ్రేక్ చేయాల‌ని ఎన్టీఆర్ అభిమానులు క‌సితోనే ఉన్నారు. మ‌రి వీరు క‌సితో పాత రికార్డుల‌ను ఎంత వ‌ర‌కు షేక్ చేస్తారో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news