Moviesసమంతని అడ్డంగా బుక్ చేసేసిన ప్రభాస్ .. ఈ పరిస్థితి లో...

సమంతని అడ్డంగా బుక్ చేసేసిన ప్రభాస్ .. ఈ పరిస్థితి లో కూడా.. పాపం..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్ లో నటించిన సినిమా “యశోద” ఈ సినిమా రేపు థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. కాగా సమంత మయోసైటిస్ జబ్బు కారణంగా బాధపడుతున్న సరే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూలు ఇస్తూ తనదైన స్టైల్ లో సినిమాను ప్రమోట్ చేస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ టాక్ ప్రకారం సమంత యశోద సినిమా 50 – 50 ఛాన్సులు అందుకుటుంది అంటున్నారు జనాలు.

ఇందులో హీరో లేకపోవడం ఒక మైనస్ అయితే ..సినిమా మొత్తం సరోగసి ప్రాసెస్ మీదే డిపెండ్ అయ్యి రన్ అవడం మరో బిగ్గెస్ట్ మైనస్ అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా ఈ సినిమాకు కాంపిటీషన్గా ప్రభాస్ నటించిన వర్షం సినిమా రీ రిలీజ్ చేయడం మరో బిగ్ షాకింగ్ అని చెప్పాలి . ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ సినిమాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మరి ముఖ్యంగా మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ..ఈ క్రమంలోనే స్టార్ హీరోలు అందరూ తమ కెరియర్ లోని బ్లాక్ బస్టర్ సినిమాలను మళ్లీ రిలీజ్ చేసి పూర్వ వైభవం అందుకోవడానికి ట్రై చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రభాస్ నటించిన వర్షం సినిమా రేపు గ్రాండ్గా 4క్ వర్షెన్ లో రిలీజ్ కాబోతుంది . అయితే సమంత నటించిన యశోద సినిమా కూడా రేపే థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. వర్షం సినిమా ప్రభావం యశోద సినిమాపై పూర్తిగా పడే అవకాశం ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు. మనకు తెలిసిందే వర్షం సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే కళ్ళు అర్పకుండా చూసే జనాలు ఎంతోమంది ఉన్నారు . మరి అలాంటిది 4క్ వర్షెన్ లో వర్షం మూవీ.. బిగ్ స్క్రీన్ పై చూస్తుంటే జనాలు ఆగుతారా ..ఓ ఊపు ఊపేయరు. ఈ ఊపులో సమంత ఏమైపోతుందో కూడా ఎవరు పట్టించుకోరు ..ఒకవేళ నిజంగా సమంత యశోద సినిమా కాన్ని ఫ్లాప్ అయితే సమంత కెరీర్ కు బిగ్గెస్ట్ డిజాస్టర్ స్టార్ట్ అని అంటున్నారు సినీ ప్రముఖులు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news