Moviesఆ ముగ్గురు హీరోయిన్లు మెగా ఫ్యామిలీ కోడ‌ళ్లు అవుతారా... ఇండ‌స్ట్రీ హాట్...

ఆ ముగ్గురు హీరోయిన్లు మెగా ఫ్యామిలీ కోడ‌ళ్లు అవుతారా… ఇండ‌స్ట్రీ హాట్ టాపిక్‌గా 3 ల‌వ్ స్టోరీలు..!

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ హీరోలు వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. స‌గటున యేడాదిలో 10కు పైగా మెగా హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక మెగా ఫ్యామిలీకి చెందిన ముగ్గురు హీరోలు.. ముగ్గురు హీరోయిన్ల ల‌వ్ ఎఫైర్లు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా ఉన్నాయి. ఆ ముగ్గురు హీరోయిన్లు.. ముగ్గురు యంగ్ హీరోయిన్ల‌తో ప్రేమాయ‌ణాలు న‌డుపుతున్నార‌ని.. ఖ‌చ్చితంగా ఈ హీరోయిన్ల‌లో ఒక‌రు లేదా ఇద్ద‌రు అయినా మెగా కాంపౌండ్‌లోకి కోడ‌ళ్లుగా అడుగు పెడ‌తార‌న్న గుస‌గుస‌లు గ‌ట్టిగా న‌డుస్తున్నాయి. మ‌రి ఆ ముగ్గురు హీరోలు, హీరోయిన్ల ఎఫైర్లు ఏంటో చూద్దాం.

1- సాయిధ‌ర‌మ్ తేజ్ – రెజీనా… ఇప్పుడు మ‌రో హీరోయిన్ కూడానా…!
మెగా మేన‌ళ్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ రెజీనా వ‌రుస పెట్టి సినిమాలు చేశారు. వీరి కాంబోలో పిల్లా నువ్వు లేన జీవితం, సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్ సినిమాలు వ‌చ్చి హిట్ కొట్టాయి. ఆ టైంలోనే వీరిద్ద‌రు పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నార‌న్న ప్ర‌చారం గ‌ట్టిగా వినిపించింది. హైద‌రాబాద్‌లో ఎక్క‌డ చూసినా వీరిద్ద‌రే చెట్టాప‌ట్టాలేసుకుని క‌నిపించేవారు. త‌ర్వాత న‌క్ష‌త్రం సినిమాలోనూ మ‌రోసారి న‌టించారు. పైగా ఒక‌రిని విడిచి మ‌రొక‌రు ఉండ‌లేనంత ఘాటుగా ప్రేమ‌లో ఉన్నార‌న్న టాక్ కూడా వ‌చ్చింది. ఆ త‌ర్వాత కాస్త గ్యాప్ వ‌చ్చినట్లుంది. అయినా కూడా సాయి ఇప్పుడు మ‌రో హీరోయిన్‌తో ప్రేమ‌లో ఉన్నాడ‌ని… ఆమెనే త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని అంటున్నారు. ఆ హీరోయిన్ కూడా సాయికి జోడీగా ఓ సినిమాలో న‌టించింది.

2- వ‌రుణ్ తేజ్ – లావ‌ణ్య త్రిపాఠి :
ఇక లావ‌ణ్య‌, వ‌రుణ్ క‌లిసి మిస్ట‌ర్‌, అంత‌రిక్షం రెండు సినిమాలు చేశారు. ఆ స‌మ‌యంలో ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్త వీరి ప్రేమ‌కు దారి తీసిందంటారు. ఒక్క‌టి మాత్రం నిజం.. వ‌రుణ్ చెల్లి నిహారిక పెళ్లి జైపూర్‌లో చాలా వైభ‌వంగా జ‌రిగింది. మెగా ఫ్యామిలీకి చెందిన అతి కొద్దిమంది స‌న్నిహితులు మాత్ర‌మే ఈ పెళ్లికి వెళ్లారు.. బ‌య‌ట వారికి ఆహ్వానాలు లేవు. అయినా కూడా ఈ పెళ్లిలో లావ‌ణ్య అంతా తానై వ్య‌వ‌హ‌రించ‌డంతో పాటు నిహారిక‌ను పెళ్లి కూతురును చేసింద‌గ్గ‌ర నుంచి పెళ్లి తంతు పూర్త‌య్యే వ‌ర‌కు అంతా తానే చ‌క్క పెట్టేసింది.. ఏ మాత్రం వీలున్నా వ‌రుణ్‌, లావ‌ణ్య బెంగ‌ళూరులో ఎంచ‌క్కా ఎంజాయ్ చేస్తున్నార‌న్న టాక్ ఉంది. వ‌రుణ్ ఇప్ప‌టికే లావ‌ణ్య‌కు ప్ర‌పోజ్ కూడా చేసేశాడ‌ని… నాగ‌బాబు దంప‌తుల‌కు కూడా ఈ సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రిని త‌మ ఇంటి కోడ‌లిగా చేసుకోవ‌డం ఇష్ట‌మే అని కూడా తెలుస్తోంది.

3- అల్లు శిరీష్ – అనూ ఎమ్మాన్యుయేల్ :
ఇక మెగా ఫ్యామిలీలో మ‌రో ప్రేమ గుస‌గుస అల్లు శిరీష్‌, అనూ ఎమ్మాన్యుయేల్‌ది. వీరిద్ద‌రు క‌లిసి ఊర్వ‌శివో రాక్ష‌సివో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ క‌రోనాకు ముందు నుంచే న‌డుస్తోంది. ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రు ప్రేమ‌లో ప‌డిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారంపై శిరీష్ తెలివిగా స్పందించ‌డం విశేషం. తాము ఇద్ద‌రం మంచి స్నేహితులం అని.. కొంత కాలంగా క‌లిసి ప‌నిచేయ‌డంతో త‌మ మ‌ధ్య మంచి అనుబంధం ఏర్ప‌డింద‌ని.. అనూ చాలా సైలెంట్ అని… ఇద్ద‌రి అభిరుచులు క‌ల‌వ‌డంతో తాము మాట్లాడుకునేందుకు ఎక్కువ స‌మ‌యం దొరికింద‌ని చెప్పాడు. అనూ వ‌ర్క్ విష‌యంలో ప్రొఫెష‌న‌ల్‌గా ఉండ‌డంతో తాము రొమాంటిక్ సీన్లు చేసేట‌ప్పుడు ఇబ్బంది ప‌డ‌లేద‌ని చెప్పాడు. ఏదేమైనా శిరీష్ మాట్లాడిన మాట‌లు చూస్తుంటూనే వీరి మ‌ధ్య ఏదో ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. మ‌రి ఈ మూడు జంట‌ల్లో ఏ జంట‌లు పెళ్లి పీట‌లు ఎక్కుతాయో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news