Moviesunstoppable 2 :షోకి మొదట గెస్ట్ గా చంద్రబాబుని సెలక్ట్...

unstoppable 2 :షోకి మొదట గెస్ట్ గా చంద్రబాబుని సెలక్ట్ చేసింది ఎవరో తెలిస్తే అస్సలు నమ్మలేరు..ట్వీస్ట్ అంటే ఇది..!!

కెరియర్ లోని ఫస్ట్ టైం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన షో అన్డ్ స్టాపబుల్. ఈ టాక్ షో నందమూరి ఫ్యాన్స్ కు భీబత్సంగా నచ్చేసింది . అంతేకాదు ఎప్పుడు లేని విధంగా బాలయ్యను హోస్టుగా చూడడం ఫాన్స్ కు కొత్త ఊపునిచ్చింది. అయితే ఫస్ట్ టైం అయినప్పటికీ ఏమాత్రం భయం బెరకు లేకుండా స్పాంటేనియస్ గా తనదైన స్టైల్ యాంకరింగ్ చేయడం బాలకృష్ణకే దక్కింది. కాగా సీజన్ వన్ సక్సెస్ అవ్వడంతో ఆహా వాళ్లు సీజన్ 2 స్టార్ట్ చేశారు.

రీసెంట్ గానే దీనికి సంబంధించిన ఫస్ట్ ప్రోమో అఫీషియల్ గా రిలీజ్ చేశారు . ఈ షో కి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ ఫస్ట్ గెస్ట్ గా వచ్చారు . దీంతో ఓ విధంగా ఆహా ఓటీటీకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెరిగేలా చేసింది. కాగా నిన్న సాయంత్రం అన్ స్టాపబుల్ సీజన్ 2 కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు లోకేష్ తో బాలయ్య చేసిన సందడి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. బాలయ్య తనదైన స్టైల్ లో వియ్యంకుడికి ప్రశ్నలు వేయడం.. దానికి ధీటుగా చంద్రబాబు సమాధానం ఇవ్వడం షోకి హైలెట్గా నిలిచింది. అంతేకాదు “మీరు పొలిటీషియన్స్ కదా.. మీకు రొమాంటిక్ చరిత్ర ఏదైనా ఉందా అని అడగ్గా.. మీరు సినిమాలో చేస్తాం మేము కాలేజీ రోజుల్లో చేసాం.. అంతే తేడా ..”అంటూ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చారు చంద్రబాబునాయుడు.

అంతేకాదు ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఇలా ఏ షోలో కూడా మాట్లాడనంత చక్కగా మాట్లాడారు. ఈ షో లో రాజకీయ తప్పు ఒప్పుల గురించి కూడా చంద్రబాబు మాట్లాడినట్టు తెలుస్తుంది. అంతేకాదు మామను, నాన్నను సోఫాలో కూర్చోబెట్టి హోస్ట్ గా లోకేష్ సరికొత్త అవతారం ఎత్తి..ఇద్దరిని ప్రశ్నిస్తూ చలాకీగా మాట్లాడారు . అయితే ఈ షోకు చంద్రబాబు నాయుడు గెస్ట్ గా పిలవాలి అనుకున్న ఐడియా అల్లు అర్జున్ దట . నిజానికి ఈ షో కి ఫస్ట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవిని పిలిపించాలనుకున్నారట . అప్పుడే గాడ్ ఫాదర్ కూడా రిలీజ్ డేట్ ఇవ్వడం సినిమాకు ఆయనకు మరింత పేరు ప్లస్ అవుతుందని అనుకున్నారట . కానీ అల్లు అర్జున్ ఎవరు ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు లోకేష్ ని ఈ సీజన్ కి గెస్ట్ గా వస్తే పొలిటికల్ పరంగా సినిమాల పరంగా హైప్ వస్తుందని చెప్పుకొచ్చారట. దీంతో వెంటనే అల్లు అరవింద్ బాలకృష్ణతో మాట్లాడటం.. బాలకృష్ణ చిరంజీవి లోకేష్ ను అడగడం వాళ్ళు నో చెప్పకుండా ఎస్ చెప్పడంతో ఇప్పుడు ఇలా మన ముందుకు సీజన్ 2 లో ఫస్ట్ ఎపిసోడ్లో గెస్ట్లు గా వచ్చారు. మరి చూడాలి పూర్తి ఎపిసోడ్ లో చంద్రబాబు లోకేష్ బాలయ్య ఎంత అల్లరి చేశారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news