Moviesఅబ్బబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి..బంపర్ ఆఫర్ కొట్టేసిన త్రిష..!!

అబ్బబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి..బంపర్ ఆఫర్ కొట్టేసిన త్రిష..!!

వావ్ ..ఇది నిజంగా త్రిష అభిమానులకు మంచి కిక్కిచ్చే న్యూస్. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో త్రిషకి ఎలాంటి పేరు ఉందో . ఆల్మోస్ట్ కోలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరితోను నటించి మెప్పించింది. టాలీవుడ్ లో ఉన్న బడా హీరోలతో అందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకొని మంచి మంచి హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది .

త్రిష నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కాగా కొన్ని ఊహించని కారణాల వల్ల సినీ ఇండస్ట్రీకి దూరమైన త్రిష రీసెంట్గా మణిరత్నం డైరెక్షన్లో తెరకెక్కిన పోనియన్ సెల్వన్ సినిమాలో “కుందవై” దేవి పాత్రలో నటించి జనాలను మెప్పించింది . ఈ ఒక్క సినిమాతో త్రిష మళ్లీ తన పూర్వ వైభవం అందుకుంది.

ఈ క్రమంలోనే త్రిష మంచి మంచి అవకాశాలను మళ్లీ తన ఖాతాలో వేసుకుంటుంది . రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం కోలీవుడ్ జనాలు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూస్తున్న విజయ్ 67వ సినిమాలో హీరోయిన్గా త్రిష సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. తెరపై త్రిష విజయ్ ను జంటగా కలిసి చూస్తే ఆ రికార్డులు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు . ఒకవేళ ఇదే నిజమైతే నిజంగా త్రిష విజయ్ తో జత కడితే మాత్రం.. కెరియర్లో త్రిష ఇక వెనక్కి తిరిగి చూసుకునే పని అవసరం ఉండదు అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news