Moviesశ్రీనిధి శెట్టిని ప్ర‌భాస్ ఆ కార‌ణంతోనే వ‌ద్ద‌న్నాడా...!

శ్రీనిధి శెట్టిని ప్ర‌భాస్ ఆ కార‌ణంతోనే వ‌ద్ద‌న్నాడా…!

పాన్ ఇండియా స్టార్‌గా అసాధారణమైన క్రేజ్ తెచ్చుకున్న డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం భారీ చిత్రాలను చేస్తున్నారు. ఆయన సినిమా అంటే బడ్జెట్ పాన్ ఇండియా రేంజ్‌లో ఉండాల్సిందే. టెక్నీషియన్స్ దగ్గర్నుంచి నటీనటులవరకు అదే రేంజ్ క్రేజ్ ఉన్న వాళ్ళు కావాలి. ప్రభాస్ కెరీర్ ప్రారంభం నుంచి కూడా అన్నీ కథను బట్టి భారీ స్థాయిలోనే ఎంచుకునేవారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మొదటి పాన్ ఇండియా సినిమా బాహుబలి సిరీస్ ఇండియ‌న్ సినిమా ఇండస్ట్రీలో ఓ కొత్త చరిత్రను సృష్ఠించింది.

ఈ సినిమా మన దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ళ సునామీని సృష్ఠించింది. మొదటి భాగం సక్సెస్ రెండవ భాగం మీద అంచనాలు భారీ స్థాయిలో పెరిగేలా చేసింది. దాన్ని అందుకునేందుకు చిత్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో పాటు హీరో ప్రభాస్ పడిన శ్రమ అంతా ఇంతా కాదు. అయితే, రెండవ భాగం విడుదలయ్యాక కూడా వచ్చిన కాంప్లిమెంట్స్, ప్రశంసలు తారా స్థాయిలో ఉన్నాయి. ఆ క్రేజ్‌తో ప్రభాస్ సౌత్‌లో మాత్రమే కాదు..బాలీవుడ్ ఇండస్ట్రీతో కలిపి నంబర్ 1 స్థానానికి చేరుకున్నారు.

దాంతో ఆయన సినిమా బడ్జెట్ 300 నుంచి 500 కోట్ల బడ్జెట్‌కి పెరిగిపోయింది. అంతేకాదు, మరీ ముఖ్యంగా హీరోయిన్ విషయంలో చాలా ఆలోచించి తీసుకుంటున్నారు. ప్రభాస్ రేంజ్ అంటే హీరోయిన్ కి కూడా పాన్ ఇండియా స్థాయి, మార్కెట్ కూడా ఉండేలా ఒకటికి పదిసార్లు ఆలోచించి ఎంచుకుంటున్నారు. అయినా కూడా సాహో, రాధే శ్యామ్‌ సినిమాలు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. ఈ రెండు సినిమాలకి హీరోయిన్ పెద్ద ప్లస్ అనుకున్నారు.

కానీ, అసలు మైనస్ అయింది అన్నిటికంటే హీరోయిన్సే అని సినిమా రిలీజ్ తర్వాత చెప్పుకున్నారు. దాంతో సలార్ సినిమా ఛాన్స్ మిస్సైంది శ్రీనిధి శెట్టి. యష్ – ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చి పాన్ ఇండియా సక్సెస్ సాధించిన కేజీఫ్ 1, కేజీఎఫ్ 2 చిత్రాలతో శ్రీనిధి మంచి పాపులారిటీని తెచ్చుకుంది. అదీకాక ప్రశాంత్ నీల్‌కి కలిసొచ్చిన హీరోయిన్ అని చెప్పుకున్నారు.

కానీ, ఇదే హీరోయిన్ మన ప్రభాస్‌కి ఆనలేదు. తన మార్కెట్ స్టామినాకి శ్రీనిధి ఏమాత్రం సూటవదని ప్రభాస్ ప్రశాంత్ నీల్ కోరినా వద్దని చెప్పాడ‌ట. అందుకే స‌లార్‌కు శృతీహాస‌న్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. లేదంటే సలార్ మూవీతో హ్యాట్రిక్ కాంబో అని ప్రశాంత్ నీల్ – శ్రీనిధి శెట్టిని అనుకునేవారు. ప్రభాస్ జతన ఓ హిట్ దక్కేది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news