Moviesఅమ్మ బాబోయ్..ముప్పై ఏళ్లు బ్యాక్‌ వెళ్తున్న సమంత.. ఇప్పుడు ఒక్కోక్కడికి పగిలిపోవాలే..!?

అమ్మ బాబోయ్..ముప్పై ఏళ్లు బ్యాక్‌ వెళ్తున్న సమంత.. ఇప్పుడు ఒక్కోక్కడికి పగిలిపోవాలే..!?

మనకు తెలిసిందే.. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ అవకాశాల కోసం ఎంత దూరమైనా వెళ్తున్నారు. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా సెటిల్ అవ్వడం కోసం నానా రకాలుగా ట్రై చేస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆస్కార్ పెర్ఫార్మన్స్ లు ఇస్తూ సినీ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి స్థాయి శక్తుల కృషి చేస్తున్నారు. అయితే ఆల్రెడీ స్టార్ హీరోయిన్ లిస్టులోకి వెళ్లిపోయిన ముద్దుగుమ్మలు మాత్రం కెరియర్లో చెప్పుకోతగ్గరోల్స్ మేము చేసాము అంటూ గుర్తుపెట్టుకోవడానికి రకరకాల స్టోరీస్ ను చూస్ చేసుకుంటున్నారు. భిన్న విభిన్నమైన కథలతో జనాలను మెప్పించడానికి ట్రై చేస్తున్నారు . ఆ లిస్టులో ముందు వరుసలో ఉంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.

మనకు తెలిసిందే విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో యాక్టివ్గా తయారైంది. తనకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ చలాకిగా ఉండే ఈ అమ్మడు గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంది . అయితే దానికి కారణం అమ్మడు నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్ అని తెలుస్తుంది . సమంత బాలీవుడ్లో సెకండ్ వెబ్ సిరీస్ కు కమిట్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి . అమెరికన్ వెబ్ సిరీస్ “సిటెడల్” ఆధారంగా హిందీలో వెబ్ సిరీస్ చేస్తున్నారట . ఇందులో సమంత-వరుణ్ ధావన్ కలిసి నటించబోతున్నారు అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ ని “ది ఫ్యామిలీ మెన్” వెబ్ సిరీస్ మేకర్స్ రూపొందించనున్నారు.

అయితే ఇందులో సమంత స్పై పాత్రలో కనిపించనుందట. అంతేకాదు ఈ సిరీస్ కోసం సమంత యాక్షన్ అడ్వెంచర్స్ చేయబోతుందట. దీనికోసం ఆమె ప్రత్యేకంగా అమెరికాలో మూడు నెలల శిక్ష తీసుకోవడానికి కూడా సిద్ధపడిందట . ప్రజెంట్ ఇప్పుడు అమెరికాలో సమంత దీనికి సంబంధించి శిక్షణ తీసుకుంటుంది . కాగా తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన వారు క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .ఈ వెబ్ సిరీస్ 1990 బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందట . అంటే సమంత 30 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోతుంది. దీని కోసం సమంత తన లుక్స్ ..మాట తీరు పూర్తిగా మార్చుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని సెషన్స్ అటెండ్ అవుతుందట . మరి చూడాలి ఇంత కష్టపడుతున్న సమంతకు ఈ వెబ్ సిరీస్ ఎలాంటి పేరు తీసుకొస్తుందో ..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news