Moviesఅందరి పై పంచ్ లు వేసే హైపర్ ఆది నోరు మూయించిన్...

అందరి పై పంచ్ లు వేసే హైపర్ ఆది నోరు మూయించిన్ నరేష్.. ఆ ఒక్క మాటతో పరువు పాయే..ముఖం ఎక్కడ పెట్టుకుంటాడో..!?

బుల్లితెరపై హైపర్ ఆదికి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా పాపులర్ అయిన హైపర్ ఆది ప్రజెంట్ బులితెరను ఏలేస్తున్నారు. స్టార్ సెలబ్రిటీగా రాజ్యమేలుతున్నాడు. ఢీ షోలో మెంటర్ గా చేసి తన వల్గర్ డైలాగ్స్ తో హైలెట్గా నిలిచిన హైపర్ ఆది ..ప్రజెంట్ శ్రీదేవి డ్రామా కంపెనీ ..జబర్దస్త్ షోలో తనదైన స్టైల్ లో స్కిట్స్ వేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు . అంతేకాదు హైపర్ ఆదికి ఉన్న ఒక బ్యాడ్ నేమ్ ఏంటంటే ప్రతి డైలాగుల్లోనూ వల్గర్ మీనింగ్ వచ్చేలా పంచస్ వేస్తూ ఉంటాడు అని జనాలు చెప్పుకుంటూ ఉంటారు.


మరి ముఖ్యంగా ఆడవాళ్ళని చులకనగా చేసి మాట్లాడడం ..ఇలాంటి పంచెస్ వేయడంలో హైపర్ ఆది తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. జబర్దస్త్ లో జడ్జ్ గా ఉన్న నాగబాబు, రోజా గారి టైం దగ్గర నుంచి ఇప్పుడు జడ్జిలుగా చేస్తున్న ఇంద్రజ వరకు.. ఆ తర్వాత అందరి కంటెస్టెంట్స్.. యాంకర్స్ పై కూడా పంచులు వేసి పాపులారిటీ దక్కించుకున్నాడు హైపర్ ఆది. అయితే ఇలాంటి పంచెస్ వేసి పాపులారిటీ తెచ్చుకున్న హైపర్ ఆది పై జబర్దస్త్ నరేష్ అదిరిపోయే విధంగా బుక్ చేసి పరువు తీసేసాడు. రీసెంట్ గా జబర్దస్త్ కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు మల్లెమాల .

ఈ జబర్దస్త్ ప్రోమోలో ఆది స్కిట్లో నరేష్ మెరిసాడు . ఈ క్రమంలోనే ఆదిపై నరేష్ వేసిన పంచెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నరేష్ మాట్లాడుతూ..” నువ్వు పెళ్లెప్పుడు చేసుకుంటావు ఆది” అని అడగ్గా.. ఆయన లైట్ గా తీసుకుంటూ..” చేసుకుంటాలే అవ్వాలి గా”అంటూ చెప్పుకొస్తాడు. దీంతో నరేష్ రెచ్చిపోయి మరి..” ఎక్కడ అవ్వాలి. ఏం అవ్వాలి . సేల్స్ మెన్ కి కూడా ఒక టార్గెట్ ఉంది అది. నీ టార్గెట్ ఎంత రా చెప్పరా.. అరేయ్ ఏంట్రా” అంటూ నరేష్ పై రెచ్చిపోయాడు. దీంతో హైపర్ ఆది కి నరేష్ పై ఏ పంచ్ వేయాలో తెలియక సైలెంట్గా టాపిక్ డైవర్ట్ చేయడం మనం ప్రోమోలో చూడొచ్చు. దీంతో ఈ ప్రోమో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. అంతే కాదు హైపర్ ఆదికి గట్టిగా ఇచ్చి పడేసాడు నరేష్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news