Moviesటాలీవుడ్ స్టార్‌ హీరోను కాజ‌ల్ నిజంగానే ప్రేమించిందా... స‌హ‌జీవ‌నం కూడా నిజ‌మేనా...!

టాలీవుడ్ స్టార్‌ హీరోను కాజ‌ల్ నిజంగానే ప్రేమించిందా… స‌హ‌జీవ‌నం కూడా నిజ‌మేనా…!

కాజల్ అగర్వాల్.. సౌత్ ఇండియా లో దాదాపు 15 సంవత్సరాలు హీరోయిన్ గా నటించి ఆయా భాషల్లో అగ్ర హీరోలు అందరితో కూడా జోడి కట్టింది. మగధీర లాంటి సినిమాతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన కాజల్ అదే రేంజ్ లో పారితోషకం సైతం దక్కించుకుంది. ఇటీవల తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లుతో ప్రేమలో పడి వివాహం చేసుకున్న కాజల్ కి ఒక అబ్బాయి కూడా పుట్టాడు. అయితే కాజల్ సినిమా జీవితం ఎన్నో వివాదాల చుట్టూ తిరిగింది. అంతే కాదు కాజల్ తో ఎంతో మంది హీరోలకు లింక్స్ ఉన్నాయంటూ రూమర్స్ ఉండేవి.

సినిమా ఇండస్ట్రీలో నటిస్తున్న కాలంలో కాజల్ ఎలాంటి ఎఫైర్ పెట్టుకోలేదని సంచలన ప్రకటన చేసినా కూడా ఆమె విషయంలో చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఆమె నటించిన సినిమాలతో పాటు ఆమెకు ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కినా.. అవి కాంట్రవర్సీలకు కూడా గురవడం గమనించాల్సిన విషయం. కెరియర్లో ఎన్నో వివాదాలు ఎదుర్కొన్నా… అన్నిటి కన్నా ముఖ్యమైన వివాదం అల్లు అర్జున్ తో ప్రేమ, సహజీవనం అన్న రూమ‌ర్ ఆమె కెరీర్లో హాట్ టాపిక్‌గా నిలిచింది.

అల్లు అర్జున్ తో చాలా రోజులపాటు కాజల్ ప్రేమలో ఉందని, వారిద్దరూ కలిసి హైదరాబాద్‌లోనే సహజీవనం చేశారనే వార్తలు జోరుగా వచ్చాయి. కానీ వీరి ప్రేమ వివాహానికి అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఒప్పుకోకపోవడంతో బ్రేక్ పడింది అనే వార్తలు వచ్చాయి. ఈ విషయంలో కాజల్ అగర్వాల్ చాలా రోజులపాటు ఎదురుచూసిందని బ్రేకప్ కావడంతో ఎంతో బాధ కూడా పడిందని అంటూ ఉంటారు.

సినిమా ల్లో నటించే అమ్మాయి తన ఇంటికి కోడలిగా రాకూడదు అని అల్లు అరవింద్ కండిషన్ పెట్టాడట. దాంతో తన స్నేహితురాలైన స్నేహారెడ్డి తో కొన్నాళ్ల తర్వాత ప్రేమలో పడి ఆమెనే పెళ్లి చేసుకున్నాడు అల్లు అర్జున్. అయితే ఈ సంఘటన జరిగినా కొన్ని రోజులకు కాజల్ మీడియాతో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనించాల్సిన విషయం. మీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా ? త్వరలో మీరు పెళ్లి చేసుకోబోతున్నారా ? అని ఒక విలేఖరి ప్రశ్నించాడు.

అందుకు ఆమె ఆన్స‌ర్ ఇస్తూ తాను సినిమాకు సంబంధించినంతవరకు ఎంతో ఎథికల్ గా ఉన్నానని… సినిమా ఇండస్ట్రీలో ఎవరితోనూ దగ్గరగా కానీ, చనువుగా నడుచుకోలేదని నిజాయితీగా ఉండి అనేక సినిమాల్లో నటించానని చెప్పింది. తన సినిమా జీవితం పూర్తిగా తన కష్టార్జితం అంటూ చెప్ప‌డం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. అయితే ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో కాజల్ పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news