Moviesఏఎన్ఆర్ జ‌య‌మాలినిని అంతలా వేధించాడా..? న‌డుంప‌ట్టుకుని ఏం చేశాడంటే..?

ఏఎన్ఆర్ జ‌య‌మాలినిని అంతలా వేధించాడా..? న‌డుంప‌ట్టుకుని ఏం చేశాడంటే..?

జ‌య‌మాలిని అంటే తెలుగు చిత్రసీమలో పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటి యూత్ కు పెద్దగా తెలియదు ఏమో గానీ ఒకప్పుడు జయమాలిని అంటే యూత్ పడిచచ్చే వాళ్ళు. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయాలంటే జయమాలిని ఉండాల్సిందే. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్ లకు జయమాలిని స్టెప్పులు వేసేవాళ్లు. తన అందం తో డ్యాన్స్ తో జయమాలిని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అస‌లు ఎంత పెద్ద హీరో సినిమా అయినా జ‌య‌మాలిని స్పెష‌ల్ సాంగ్ ఉండాల‌ని అప్ప‌ట్లో డిస్ట్రిబ్యూట‌ర్లు ప‌ట్టుబ‌ట్టేవారంటే ఆమె క్రేజ్ ఏంటో అర్థ‌మ‌వుతోంది.

ఓ అప్పారావు… ఓ సుబ్బారావు, నీ ఇల్లు బంగారం కాను, గుడివాడ వెళ్ళాను…గుంటూరు వెళ్లాను అంటే ఆ టైమ్ హిట్ పాటలకు స్టెప్పులు వేసింది కూడా జయమాలినీయే. అప్పటి స్టార్స్ అందరి సినిమాల్లోనూ జయమాలిని నటించగా ఆమె కెరీర్ లో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం జయమాలిని లేటు వయసులో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవల జయమాలిని ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది.

అంతే కాకుండా ఆ ఇంటర్వ్యూలో జయమాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఎన్ఆర్ తో కలిసి తను చాలా సినిమాల్లో నటించానని చెప్పారు. ఆలుమొగలు, సంగీత సామ్రాట్ తో సహా కొన్ని సినిమాల్లో నటించినట్టు చెప్పారు. ఈ క్రమంలో ఎఎన్‌అర్ ఓ రోజు సినిమా షూటింగ్ కు తన భార్యతో వచ్చారని చెప్పారు. ఆ సమయంలో పక్కనుండి వెళుతున్న తనను పిలిచి మా ఆవిడ నిన్ను చెడ్డమ్మాయి అంటుందని అన్నారని.. ఆ మాట అంది తను కాదని తన‌ భార్య అలా అంటుందని చెప్పారు.

కానీ అది విని తను చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయా అని అన్నారు. అంతే కాకుండా షూటింగ్ సమయంలో ఏఎన్ఆర్ అల్లరి చేస్తుండేవాడు అని అన్నారు. ఒక సాంగ్ షూట్ లో తన నడుము పట్టుకుని జయమాలిని నడుము ఇంత పెద్దగా ఉంది నా రెండు చేతులకు అందడం లేదు అంటూ అన్నారని చెప్పారు. అక్కడే ఉన్న నటుడు గిరిబాబు కలుగజేసుకుని ఆ ప్రశ్న జయమాలిని కి ఏం ? తెలుస్తుంది వాళ్ళ అమ్మ నాన్న లను అడగాలి అంటూ కామెంట్ చేశారని చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news