Moviesపిలిచినా ఆ హీరో రానన్నాడని 6 బీర్లు తాగిన స్నేహ ఉల్లాల్...?...

పిలిచినా ఆ హీరో రానన్నాడని 6 బీర్లు తాగిన స్నేహ ఉల్లాల్…? ఆ హీరో ఎవరంటే…?

సినిమా ఇండ‌స్ట్రీలో హీరోయిన్ ల‌ను పోలిన హీరోయిన్ లు అరుదుగా క‌నిపిస్తుంటారు. కానీ స్నేహ ఉల్లాల్ మాత్రం అచ్చం ఐశ్వ‌ర్య‌రాయ్ లాగానే ఉంటుంది. ఐశ్వ‌ర్య‌రాయ్ తో విడిపోయిన త‌ర‌వాత స‌ల్మాన్ ఖాన్ త‌న సినిమా ద్వారానే అదే లుక్ లో ఉన్న స్నేహా ఉల్లాల్ ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశాడ‌ని ఓ టాక్ కూడా ఉంది. ఇక స్నేహా ఉల్లాల్ నాగార్జున్ హీరోగా న‌టించిన కింగ్ సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయ్యింది. ఈ సినిమాలో చిన్న పాత్రలో న‌టించిన్ప‌టికి ఆ త‌ర‌వాత హీరోయిన్ గా ఆఫ‌ర్ లు అందుకుంది.

ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో ఈ బ్యూటీ సూప‌ర్ హిట్ ను త‌న ఖాతాలో వేసుకుంది. అంతే కాకుండా స్నేహ ఉల్లాల్ న‌టించిన క‌రెంట్ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో అక్కినేని మేన‌ళ్లుడు సుశాంత్ హీరోగా న‌టించాడు. తెలుగుతో పాటూ త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో కూడా స్నేహా ఉల్లాల్ సినిమాలు చేసి ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఇక సినిమా ఆఫ‌ర్ లు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో 2011 నుండి స్నేహ ఉల్లాల్ టాలీవుడ్ కు దూరం అయ్యింది. సినిమాల‌కు దూరంగా ఉన్న‌ప్ప‌టికీ ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.

హాట్ ఫోటోల‌తో కుర్రాళ్ల మ‌తులు పొగొడుతుంది. ఇటీవ‌ల వెబ్ సిరీస్ ల‌తో స్నేహ ఉల్లాల్ రీఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ స‌క్సెస్ అవ్వ‌లేక‌పోయింది. ఇదిలా ఉండ‌గా స్నేహా ఉల్లాల్ ఎక్కువ‌గా పార్టీల‌కు ప‌బ్బుల‌కు తిరుగుతుంద‌ని ఇండ‌స్ట్రీలో టాక్ ఉండేది. అప్ప‌ట్లో ఈ అమ్మ‌డు తాగి ర‌చ్చ చేసింద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఇదిలా ఉంటే ఓ టాలీవుడ్ హీరో పుట్టిన రోజుకు స్నేహా ఉల్లాల్ రెండు పబ్ ల‌లో పార్టీ కూడా ఇచ్చిందని టాక్.

ఆ బ‌ర్త్ డే బాయ్ మ‌రెవ‌రో కాదు మంచు మ‌నోజ్. ఇద్ద‌రికీ మ‌ధ్య ఉన్న ఫ్రెండ్షిప్ తో స్నేహా ఉల్లాల్ మ‌నోజ్ పుట్టినరోజున పార్టీ ఏర్పాటు చేసి స్నేహితుల‌ను పిలిచింద‌ట‌. కానీ మ‌నోజ్ మాత్రం ఆ పుట్టినరోజుకు హాజ‌రుకాలేద‌ట‌. ఇక మ‌నోజ్ రాక‌పోయిన‌ప్ప‌టికీ స్నేహా ఉల్లాల్ త‌న ఫ్రెండ్స్ ను నిరాశ‌ప‌ర్చ‌వ‌ద్ద‌ని వారితో క‌లిసి ఆరు బీర్ల‌వ‌ర‌కూ తాగి ప‌డిపోయింద‌ట‌. ఆ త‌ర‌వాత కూడా రోడ్ల‌పై ర‌చ్చ చేసింద‌ని అప్ప‌ట్లో వార్త‌లు వైర‌ల్ అయ్యాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news