Moviesమ‌హేష్ - రాజ‌మౌళి సినిమాలో ఆ స్టార్‌ హీరోయిన్ ఫిక్సా... అబ్బ‌బ్బా...

మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాలో ఆ స్టార్‌ హీరోయిన్ ఫిక్సా… అబ్బ‌బ్బా ఏం కాంబినేష‌న్‌…!

`ఆర్ఆర్ఆర్` తరువాత మహేష్‌ బాబుతో సినిమా చేయబోతున్నట్లు రాజమౌళి ప్రకటించిన విషయం మ‌న అంద‌రికి తెలిసిన విషయమే. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు, ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళి సూపర్ కాంబినేష‌న్ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు 28వ సినిమా గురించి ప్రేక్షకులు మాములుగా ఎదురుచూడ‌డం లేదు. మహేష్ సినిమా అంటే ప్రేక్షకుల‌కు అంత‌ క్రేజ్ ఉంటుంది. అందులోనూ రాజమౌళి తో మహేష్ సినిమా అంటే అభిమానులకు పండగే పండగా.

ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మహేష్ తో రాజ‌మౌళి ఎలాంటి ? సినిమా చేస్తాడో అన్న ఆసక్తి ప్రేక్షకులో నెలకొంది. ఇదిలా ఉంటే రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల‌కు భారీ అంచనాలు నెలకొంటున్నాయి. `ఆర్ఆర్ఆర్` చిత్రంతో మరోసారి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళి .. సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో వండర్‌కు రెడీ అవుతున్నారు. మహేష్‌ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తికాగానే రాజమౌళి సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారు.

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాపై ఓ టాక్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె ఫ్రంట్ రేస్‌లో ఉన్న‌ట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో మామూలుగా వైర‌ల్ కావ‌డం లేదు. ప్రస్తుతానికి మాత్రం ఇందులో ఎలాంటి క్లారిటీ లేదు. ఈ వార్తలో ఎంత వరకు ? నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ప్రేక్షకులు వేచి చూడాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news