Moviesమ‌ళ్లీ అఖండ అరాచ‌క‌మేనా... NBK 107 నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ క్లోజ్‌...!

మ‌ళ్లీ అఖండ అరాచ‌క‌మేనా… NBK 107 నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ క్లోజ్‌…!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ అఖండ‌తో అరాచ‌కం చూపించేశాడు. అఖండ మామూలు హిట్ అవ్వ‌లేదు. బాల‌య్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్ అఖండ‌. అఖండ‌తో బాల‌య్య మామూలు రైజింగ్‌లోకి రాలేదు. గ‌త డిసెంబ‌ర్ 2న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అఖండ త‌ర్వాత వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టులు చేస్తోన్న బాల‌య్య మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న కొత్త సినిమా చేస్తున్నాడు.

NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. ఈ సినిమాలో బాల‌య్య‌కు జోడీగా శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తుండ‌గా… మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాలో న‌టి హ‌నీ రోస్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంద‌ట‌.

ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వ‌చ్చే డిసెంబ‌ర్లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవ‌ల ఫారిన్ షెడ్యూల్లో సైతం ఓ రొమాంటిక్ సాంగ్‌తో పాటు కొన్ని యాక్ష‌న్ సీన్లు షూట్ చేసుకుని ఇండియాకు తిరిగి వ‌చ్చేశారు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమా నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ బిజినెస్ క్లోజ్ చేశార‌ట మేక‌ర్స్‌.

రు. 58 కోట్ల‌కు ఈ సినిమా నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ క్లోజ్ అయ్యాయ‌ట‌. ఇది బాల‌య్య కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ రికార్డ్‌. అఖండ‌తో వ‌చ్చిన క్రేజ్‌తో బాల‌య్య సినిమాకు ఈ రేంజ్‌లో బిజినెస్ డీల్స్ అయితే న‌డుస్తున్నాయ‌ని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు భారీ బ‌డ్జెట్ పెడుతున్నారు. మ‌లినేని గోపీ క్రాక్ త‌ర్వాత డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు భారీగా ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news