Moviesమంచు విష్ణు "దున్నపోతు" పోస్ట్...ఆ స్టార్ హీరో కొడుకు కి సెటైర్...

మంచు విష్ణు “దున్నపోతు” పోస్ట్…ఆ స్టార్ హీరో కొడుకు కి సెటైర్ నేనా..?

అయ్యో పాపం.. తెలిసి చేశాడో.. తెలియక చేసాడో కానీ టాలీవుడ్ స్టార్ హీరో సన్ మంచు విష్ణు ..అలాగే మా అధ్యక్షుడిగా ప్రజెంట్ రాజ్యమేలుతున్న విష్ణు చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ముందుగానే మంచు ఫ్యామిలీ అంటే కాచుకొని కూర్చునే ట్రోలర్స్ కి ఇప్పుడు మరింత ప్లస్ అయ్యింది. ఎప్పుడెప్పుడు మంచు ఫ్యామిలీని ట్రోల్ చేద్దామా .. సినీ ఇండస్ట్రీలో వాళ్ళ ఫ్యామిలీ పరువు తీద్దామా.. అంటూ సో కాల్డ్ బ్యాచ్ రెడీగా ఉంటారు. అలాంటి వాళ్ళకి మంచు విష్ణు మంచి కంటెంట్ ఇచ్చినట్లైంది.

మనకు తెలిసిందే టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు సినిమా ఇండస్ట్రీలోకి నాన్న పేరు చెప్పుకొని వచ్చినా..నాన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఉపయోగించుకొని నాన్న పలుకుబడి ఉపయోగించుకుని సినిమా స్టోరీలు చూస్ చేసుకున్న.. పాపం ఇంతవరకు స్టార్ హీరో లిస్టులోకి వెళ్ళలేకపోయాడు . కానీ తనదైన స్టైల్ లో మాత్రం నటించి మెప్పిస్తున్నాడు. అంతేకాదు ఈమధ్య మా ప్రెసిడెంట్ గా కూడా సెలెక్ట్ అయ్యాడు . దీంతో సోషల్ మీడియాలో ఆయన పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. రీసెంట్ గా ఆయన చేసిన దున్నపోతు పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

మంచు విష్ణు పోస్ట్ చేస్తూ ఓ దున్నపోతు ఫోటోని జత చేస్తూ ఆయన ఇలా రాసుకోచ్చాడు. ” నేను పది పుష్ అప్స్ చేసిన తర్వాత ..నేను ఇలానే ఉంటానని ఊహించుకుంటాను” అని క్యాప్షన్ చేసి ట్విట్ చేశాడు. అసలే మంచు ఫ్యామిలీ అంటే గుర్రుగా ఉండే మంచు హెటర్స్ ఈ పోస్ట్ తో ఆయనను ఆడేసుకుంటున్నారు. కొందరు ..”ఇది అచ్చం నీలానే ఉంది ..నీకు దీనికి తేడా లేదు “అంటూ కావాలని ఆయన్ని డౌన్ చేస్తుంటే ..మరికొందరు మాత్రం “ఈ పోస్ట్ లో చాలా అర్థం ఉందని.. మంచు ఫ్యామిలీని టార్గెట్ చేసే ఓ స్టార్ హీరో సన్ ఫిజిక్ పై కాన్సన్ట్రేషన్ తో మంచు మనోజ్ ఈ పోస్ట్ పెట్టాడని” అంటున్నారు. దీంతో ఈ దున్నపోతు పోస్ట్ పై ఓ రేంజ్ లో మీమ్‌స్ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఆ స్టార్ హీరో సన్ ఇతనే అంటూ స్టార్ హీరో కొడుకు పేరుని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. మరి మంచు విష్ణు చేసిన ఈ దున్నపోతు పోస్ట్ ఆ హీరో కొడుకు కోసమే అంటారా..? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి .

This is how I imagine I am after I do ten push ups. 😊 pic.twitter.com/YvqadZBZtH

— Vishnu Manchu (@iVishnuManchu) September 17, 2022

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news