Moviesఆ సినిమాలో రష్మీకి చెప్పకుండానే ముద్దు పెట్టించారా..?

ఆ సినిమాలో రష్మీకి చెప్పకుండానే ముద్దు పెట్టించారా..?

ఇటు బుల్లితెర మీద అటు సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేస్తూ బాగా క్రేజ్ సంపాదించుకున్న యాంకర్ కం నటి రష్మీ గౌతం. కెరీర్‌లో ఎన్నో కష్టాలు పడి..ఎన్నో అవమానాలు..ఇబ్బందులు పడి ఇంతవరకు వచ్చింది. స్మాల్ స్క్రీన్ మీద రష్మిక కి ఉన్న క్రేజ్ అసాధారణం. ఇక్కడ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో రష్మికకి లెక్కకు మించి ఫాలోవర్స్ ఉన్నారు. హీరోయిన్‌గా కూడా రష్మీకి మంచి క్రేజ్ ఉంది. కానీ, వరుసగా అవకాశాలే రావడం లేదు. దీనికి కారణం రష్మిక ఎక్కువగా సినిమాల మీద దృష్టి పెట్టకపోవడమే.

సినిమా అయితే డేట్స్ ఎక్కువగా ఇచ్చి లాక్ అవ్వాలి. అదే బుల్లితెరపై షోస్ చేసుకుంటే వచ్చే రెమ్యునరేషన్ అంతకంటే ఎక్కువ. తను ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు సినిమానా..షోలా అని ఆలోచించనవసరం లేదు. ఎంత సంపాదిస్తున్నాను అని మాత్రమే ఆలోచిస్తుంది. ఎక్కడైనా క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలి. అదే ఇప్పుడు రష్మీ చేస్తోంది. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసిన రష్మీ..ఆ తర్వాత గుంటూరు టాకీస్ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో రష్మీ ఇచ్చిన లిప్ కిస్సులు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి.

అంతేకాదు, హీరోతో రొమాంటిక్ సీన్స్ బాగా రావాలంటే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవ్వాలని.. క్లోజ్‌నెస్ పెరగాలని దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇద్దరినీ కలిసి అలా సరదాగా సినిమాలకి, షికార్లకి వెళ్ళమని సలహా ఇచ్చినట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఇది నిజమా కాదా తెలియదు గానీ, గుంటూరు టాకీస్ సినిమాలో రష్మీని హీరో ముద్దు పెట్టుకునే సందర్భం ఒకటుంటుందని దర్శకుడు ముందు రష్మీకి చెప్పలేదని ప్రచారం జరిగింది.

సీన్స్ నేచురల్‌గా రావాలంటే హీరో సడన్‌గానే వెళ్లి ముద్దు పెట్టుకోవాలని దర్శకుడు చెప్పాడట. ఇదే విషయం రష్మీని అడిగిన సందర్భంలో ఆమె అలాంటిదేమీ లేదని..ఇలా సీన్‌లో ఒక సాంగ్‌లో లిప్ లాక్ ఉంటుందని డైరెక్టర్ ముందే చెప్పారు. నేను కథ విని అది అవసరం అనిపించి ఒకే చెప్పాను. అంతే తప్ప నాకు చెప్పకుండా ఇందులో లిప్ లాక్ సీన్స్ చేయలేదని క్లారిటీ ఇచ్చింది.

ఇక రష్మీకి మంచి రెమ్యునరేషన్ ఇస్తే కొత్త హీరో అయినా నటిస్తానని చెప్పిన సందర్భాలున్నాయి. అదే పేరున్న హీరో పక్కన అవకాశం వస్తే రెమ్యునరేషన్ గురించి ఆలోచించకుండా ఒకే చెప్తానని చెప్పింది. కానీ, రష్మీ గౌతం కి ఆశించిన పెద్ద సినిమాలు రెమ్యునరేషన్ భారీగా వచ్చే కొత్త హీరోల సినిమాలు రావడం లేదు. బుల్లితెర మీద మాత్రం దున్నేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news