Moviesit's Official: కీర్తి ఖాతాలో మరో హిట్ పక్కా..ఆ డైనమిక్ హీరో...

it’s Official: కీర్తి ఖాతాలో మరో హిట్ పక్కా..ఆ డైనమిక్ హీరో తో రొమాన్స్ కు సై..!!

టాలీవుడ్ లో మహానటి అనగానే అందరికీ టక్కున గుర్తు వచ్చే పేరు కీర్తి సురేష్. చూడటానికి ఎంత చక్కగా అందంగా ఉంటుందో ..అంతే అనుకువగా పద్ధతిగా మాట్లాడుతూ.. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్. నిజానికి “సర్కారీ వారి పాట” సినిమా రిలీజ్ అయ్యే ముందు వరకు కీర్తి సురేష్ అంటే జనాల్లో మంచి పేరు ఉండేది. అమ్మడు ఎక్స్పోజింగ్ చేయదని.. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో చేస్తుందని.. సౌందర్య గారి తర్వాత అలాంటి స్థాయినందుకునే అర్హత కీర్తి సురేష్ కి ఉందని ..ఆమె అభిమానులు చెప్పుకునే వాళ్ళు.

కానీ సీన్ కట్ చేస్తే సర్కారు వారి పాట సినిమాలో అమ్మడు నటించిన తీరుకు అభిమానులు ఆశ్చర్యపోయారు. “కొందరైతే ముక్కున వేలేసుకుని.. వాట్ కీర్తి ఇది నువ్వేనా ..?”అంటూ షాక్ అయ్యారు. ఎప్పుడు చూపించని విధంగా తన నాభి అందాలను బ్యాక్ అందాలను చూపిస్తూ కుర్రాలను టెంప్ట్ చేసింది. అప్పటివరకు మహానటి అని పేరు ఉన్న కీర్తి సురేష్ కు ఇప్పుడు మహా నాటి అంటూ ట్యాగ్ ఇచ్చేసారు అభిమానులు.

కాగా.. సర్కారు వారి పాట సినిమాలో అమ్మడు నటనను చూసి కమర్షియల్ హీరోయిన్ గా కీర్తి మంచిగా రాణిస్తుంది అని.. కొందరు డైరెక్టర్స్ ఆమె వద్దకు అలాంటి స్టోరీలే తీసుకెళ్లారు. కానీ కీర్తి సురేష్ వాటిలో కొన్ని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. కొన్ని మరీ వల్గర్ స్టోరీలు కావడంతో సున్నితంగా రిజెక్ట్ చేసిందట కీర్తి సురేష్. కాగా ఈ క్రమంలోనే కీర్తి సురేష్ నెక్స్ట్ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. జయం రవి జోడి కట్టబోతుంది.

ఈ మహానటి జయం రవి జంటగా దర్శకుడు భాగ్యరాజ్ నటిస్తున్న “సైరేన” అనే సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. దీనికి సంబంధించిన మోస్టర్ పోస్టర్ ని అధికారికంగా రిలీజ్ చేసారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభం కానుంది అని చెప్పుకొచ్చారు మేకర్స్. ఆశ్చర్యం ఏమిటంటే.. ఈ సినిమాలో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టనున్నట్లు సమాచారం. మరి చూడాలి ఇన్నాళ్లు తన అంద చందాలతో అలరించిన కీర్తి పాప ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎలా మెప్పిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news