Moviesఆ హీరో సినిమా కోసం మహేశ్ బాబు మైండ్ బ్లాకింగ్ డెసీషన్.....

ఆ హీరో సినిమా కోసం మహేశ్ బాబు మైండ్ బ్లాకింగ్ డెసీషన్.. ఇది కదా ఫ్రెండ్ షిప్ అంటే.. !?

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ది ఎంత మంచి మనసు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్టార్ హీరోగా తన నటనతో తన అభిమానులను ఓ రేంజ్ లో ఉత్సాహపరుస్తున్న మహేష్ బాబు.. సినిమాలోనే కాదు రియల్ లైఫ్ లోను ఈ హీరోది అలాంటి బిహేవియర్ నే. మహేష్ బాబు తాను సంపాదించిన దాంతో సగానికి పైగా పేద పిల్లలకు ఖర్చు చేస్తూ.. కష్టం అని తెలిసిన వెంటనే వాళ్లకు సహాయం చేసి.. వాళ్ళ బాధలను తీరుస్తున్న హీరో. మహేష్ బాబు అలాంటి హెల్ప్ చేస్తున్నట్టు మాత్రం బయట పెట్టడు. జనరల్ గా కొందరు హీరోలు లక్ష రూపాయలు ఇస్తేనే మీడియాలో వార్తలు రావాలని ఆశపడుతుంటారు .

అలానే చేస్తారు కూడా.. కానీ, మహేష్ బాబు ఆ టైప్ కాదు తాను చేసిన సహాయాన్ని బయటకు రానివ్వడు. ఆ సహాయం ఆ పిల్లలకు చేరిందా..? వాళ్ళు హ్యాపీగా ఉన్నారా..? అంతే అంతవరకే ఆలోచిస్తాడు. అందుకే ఈ హీరో అంటే స్టార్ హీరో హీరోయిన్లు కూడా చాలా ఇష్టం. కాగా సినీ ఇండస్ట్రీలో కూడా మహేష్ బాబు చాలామంది హీరోలకి మాట సహాయం చేశాడు. జల్సా సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చింది మహేష్ బాబునే. ఆ సినిమా ఎంతటి పెద్ద హిట్ అయ్యిందో మనం చూసాం. ఈ సినిమాకి కాదు చాలా సినిమాలకు మహేష్ బాబు తన మాట సహాయం చేసి తనకు వారి పట్ల ఉన్న ఫ్రెండ్ షిప్ కు ఇచ్చే విలువ అందరికీ తెలిసేలా చేశాడు.

కాక రీసెంట్ గా మరో స్టార్ హీరో సినిమాలో గెస్ట్ రోల్ కు ఓకే చేసి తన ఫ్రెండ్షిప్ ఇలా ఉంటుంది అని ప్రూవ్ చేశాడు హీరో. స్టార్ హీరో మహేష్ బాబు డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అనేది అందరికి తెలిసిందే. ఇద్దరు కలిసి ఫ్యామిలీ టూర్లు కూడా వేస్తూ ఉంటారు. చాలా మంచి మంచి స్నేహితులనే చెప్పాలి. రీసెంట్ గా వంశీ పైడిపల్లి కోలీవుడ్ హీరో విజయ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వారసుడు అనే టైటిల్ తో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది.

ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన విజయ్ తో.. ఫస్ట్ టైం రొమాన్స్ చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు 50% పూర్తయినట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో ఇంపార్టెంట్ గెస్ట్ రోల్ ఉందని ..ఆ రోల్ కి మహేష్ బాబు అయితేనే.. పర్ఫెక్ట్ గా ఉంటుందని వంశీ పైడిపల్లి అనుకున్నారట. అనుకున్నదే ఆలస్యం ఈ విషయాన్ని మహేష్ బాబుకు చెప్పగానే సెకండ్ కూడా ఆలోచించకుండా ఎస్ అంటూ ఓకే చెప్పేసారట. ఈ విషయం నెట్టింట లీక్ అవ్వడంతో మహేష్ బాబు ఫ్రెండ్ షిప్ కి ఎంత వాల్యూ ఇస్తారు అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు మహేష్ బాబు లాంటి హీరో ప్రతి ఇండస్ట్రీలోనూ ఉండాలి అంటూ మిగతా ఇండస్ట్రీ హీరోలు కూడా చెప్పకు రావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఏది ఏమైనా ఒకే తెరపై మహేష్ బాబు , విజయ్ నటిస్తున్నారంటేనే అది గ్రేట్ అని చెప్పాలి. దీంతో ఈ సినిమా పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news