Moviesరష్మి పెళ్లి ఫిక్స్ అయ్యిందోచ్..అఫిషీయల్ గా చెప్పేసిన యాంకరమ్మ..!!

రష్మి పెళ్లి ఫిక్స్ అయ్యిందోచ్..అఫిషీయల్ గా చెప్పేసిన యాంకరమ్మ..!!

యస్..తాజాగా మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది ఈ న్యూస్. అందాల యాంకరమ్మ జబర్ధస్త్ హాట్ యాంకర్ రష్మి పెళ్ళి చేసుకోబోతుందా అంటే అవుననే అంటున్నారు బుల్లి తెర జనాలు. తన దైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ..వచ్చిన సినిమాలో నటిస్తూ వచ్చిన రష్మి..జబర్ధస్థ్ తో పాటు..శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా యాంకరింగ్ గా చేస్తుంది. అయితే, తాజా గా ఈ షో కి సంబంధించిన ప్రోమో ని రిలీజ్ చేశారు మేకర్స్.

అందులో..”అక్క బావెక్కడ” అనే కాన్ సెప్ట్ తో నవ్వులు పూయించారు అందరు. అయితే, ఈ ఎపిసోడ్ లో రష్మి తనకి పెళ్ళి ఫిక్స్ అయ్యిందని..మీరు ఇన్నాళ్ళు అడుగుతున్న ప్రశ్నకి ఇదే నా సమాధనం అంటూ..తనకి పెళ్ళి ఫిక్స్ అయ్యిందంటూ చెప్పుకొస్తుంది. దీంతో అక్కడున్న వారు అంతా..అబ్బాయి ఎవ్వరు ఎవ్వరు అంటూ చెప్పాలని డిమాండ్ చేస్తారు..అక్కడున్న ఆడవారు సరదాగా రష్మిని అక్క బావెక్కెడ అంటూ అరదాగా ఆటపట్టిస్తుంటారు. దీంతో ప్రోమో కట్ చేశారు.

అస్సలు నిజానికి రష్మి పెళ్ళి ఫిక్స్ అయ్యిందా..లేదా..? లేక ఎప్పటిలాగే ఇది కూడా TRP కోసమేనా..అనేది ఈ ఆది వారం ఫుల్ ఎపిసోడ్ లో చూస్తే తెలిసిపోతుంది. అయితే, దీని పై కొందరు నెటిజన్స్ “ఇది అంతా ఫేక్ “అంటూ కామెంట్స్ చేయగా..ఇంకెన్నాళ్లు రా ఈ చిల్లర పనులు..అంటూ తిడుతున్నారు. మరికొందరైతే..సుధీర్ పరిస్ధితి ఏమో మరి..పాపం అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అస్సలు ఇంతకి రష్మికి పెళ్లి కుదిరిందంటారా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news