Moviesహీరోయిన్ ' షీలా ' కెరీర్‌ను నాశ‌నం చేసిన టాలీవుడ్ టాప్...

హీరోయిన్ ‘ షీలా ‘ కెరీర్‌ను నాశ‌నం చేసిన టాలీవుడ్ టాప్ ప్రొడ్యుస‌ర్‌.. !

తమిళ చిత్రాలలో బాల నటిగా దాదాపు 20 చిత్రాలలో నటించింది షీలా కౌర్. మణిరత్నం లాంటి అగ్ర దర్శకుడు రూపొందించిన చిత్రాలలో చిన్నప్పుడే నటించే అవకాశం అందుకున్న షీలా ఆ తర్వాత హీరోయిన్‌గా తెలుగుతో పాటు తమిళం కన్నడ, మలయాళ భాషలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో చేసింది కేవలం నాలుగు సినిమాలే. మొదటి సినిమా నవదీప్ సరసన నటించిన సీతాకోక చిలుక.

ఈ సినిమాలోని తన నటనకి మంచి పేరు రావడంతో ఆ తర్వాత రాజు భాయ్ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం అందుకుంది. దీని తర్వాత హలో ప్రేమిస్తారా, దిల్ రాజు నిర్మాతగా అల్లు అర్జున్ సరసన పరుగు సినిమాలో నటించింది. పరుగు షీలాకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మాయాబజార్, మస్కా, అదుర్స్ సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. అదుర్స్ తర్వాత షీలా కి మంచి క్రేజ్ దక్కింది. దీనికి కారణం ఎన్.టి.ఆర్. తన సరసన నటించిన షీలాకు తర్వాత వరుసగా ఆఫర్స్ వచ్చాయి.

కానీ, ఓ టాలీవుడ్ అగ్ర నిర్మాత ఆ అవకాశాలను ఒప్పుకోనివ్వలేదని ప్రచారం జరిగింది. చాలాకాలం ఆ నిర్మాత తనని సినిమాలకు దూరంగా ఉంచాడని టాక్ వినిపించింది. సినిమాలలో చేస్తే వచ్చే రెమ్యునరేషన్ నేనే ఇస్తాను..ఇక బయటకి వెళ్ళకు అని చెప్పినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఇందులో నిజా నిజాలేంటో తెలియదు గానీ, షీలా నిజంగానే అదుర్స్ బ్లాక్ బస్టర్ అయినా సినిమాలలో నటించలేదు.

చాలా ఏళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సదురు నిర్మాతతో మాత్రం సన్నిహితంగా మెలిగిందని ఇండ‌స్ట్రీ వర్గాలలో టాక్ వినిపించింది. కారణం ఏదైనా షీలా మంచి స్టేటస్ దక్కించుకోవాల్సింది. కానీ, అది రాకుండానే ఇండస్ట్రీకీ దూరమై పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. తన విషయంలో ఇప్పటికీ కొందరు జాలిగానే మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు, ఆ వ్యక్తి గురించి కూడా అంతే నీచంగా కామెంట్స్ చేస్తుంటారు.

 

మరి ఇది ఎంతవరకు నిజమనేది ఆ ఇద్దరికి మాత్రమే తెలియాలి. ఏదేమైనా నిప్పులేనిదే పొగరాదంటూ కదా..అది మాత్రం వాస్తవం. ఇక షీలా తెలుగు కంటే మిగతా భాషలలోనే ఎక్కువ సినిమాలు చేసింది. అచ్చ తెలుగమ్మాయిలా కనిపించే తను టాలీవుడ్ యంగ్ హీరోలకి మంచి జోడీ. కానీ, అందరితో నటించే అవకాశాలను మాత్రం కోల్పోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news