MoviesLiger Trailer: లయన్ కి టైగర్ కి పుట్టిన క్రాస్ బ్రీడ్...

Liger Trailer: లయన్ కి టైగర్ కి పుట్టిన క్రాస్ బ్రీడ్ సాలా గాడే ఈ లైగర్..విజయ్ గూస్ బంప్స్ పర్ఫామెన్స్..పిచ్చెక్కిపోవాల్సిందే..!!

వావ్..విజయ్ కుమ్మేశాడు. కొద్ది సేపటి క్రితమే రిలీజ్ అయిన..లైగర్ సినిమా ట్రైలర్ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. గత కొంత కాలంగా ఈ సినిమా నుండి రిలీజ్ అవుతున్న అప్ డేట్స్ అన్ని అభిమానుల అంచనా పెంచేయగా..తాజాగా..ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్..చూస్తుంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పాక తప్పదు అంటున్నారు సినీ విశ్లేషకులు. విజయ్ పర్ ఫామెన్స్ టూ గుడ్ అంటున్నారు జనాలు.

విజయ్ దేవరకొండ హీరోగా – బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా..పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న మూవీ లైగర్. ఈ సినిమా టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనదైన స్టైల్లో విభిన్న రీతిలో తెరకెక్కిస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా వ‌స్తోన్న ఈ సినిమాను ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్‌, పూరి క‌నెక్ట్స్ ప‌తాకంపై క‌ర‌ణ్ జోహ‌ర్‌-పూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమా వచ్చే నేల్ 25 న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ కానుంది.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసారు. తెలుగులో ఈ ట్రైలర్ ను..మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. ఒక్క ముక్క లో చెప్పాలంటే విజయ్..జాతకాని తిరగ రాసే సినిమా ఇది అని చెప్పాలి. పూరీ కి మంచి కమ్ బ్యాక్ సినిమా..సినిమాల్లో ఒక్కో డైలాగ్ పవర్ ఫుల్ గా పేలింది. అబ్బో..అనన్య అందాలు సినిమాకి ప్లస్ కానున్నాయి. మరీ ముఖ్యంగా..సినిమా లో రమ్య కృష్ణ పాత్ర హైలెట్ గా నిలిచింది.

“ఒక్క లయన్ కి టైగర్ కి పుట్టిన క్రాస్ బ్రీడ్ సాలా గాడే ఈ లైగర్ నా కొడుకు” అంటూ చెప్పుకొచ్చే డైలాగ్ అద్దిరిపోయింది. అంతేకాదు ఒకానొక సీన్ లో చీర పైకి ఎత్తి..విజయ్ ని తన్నే సీన్ రమ్య కృష్ణ సూపర్ గా చేసింది. నో డౌట్ ..ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే. పూరీ ఖాతాలో బంపర్ హిట్ వచ్చిన్నట్లే అంటున్నారు విజయ్ అభిమానులు..గూస్ బంప్స్ తెప్పించే లైగర్ ట్రైలర్ మీరు చూసేయ్యండి..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news