Moviesతల్లి మాటను కాదని అమెరికా వెళ్లీ మ‌రీ పెళ్లి చేసుకున్న భానుప్రియ‌......

తల్లి మాటను కాదని అమెరికా వెళ్లీ మ‌రీ పెళ్లి చేసుకున్న భానుప్రియ‌… చివ‌ర‌కు అంతా రివ‌ర్స్‌…!

దశాబ్దానికి పైగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా చలామణి అయిన నటీమణులలో భానుప్రియ కూడా ఒకరు. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాదు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, బుల్లితెరపై కూడా నటించింది. హీరోయిన్ గా ఏకంగా 110 సినిమాల్లో నటించింది భానుప్రియ. మొదటి సారిగా తమిళ సినిమాతో ఇండస్ట్రీకి డెబ్యూ చేసిన భానుప్రియ ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తొలిసారి తెలుగులో నటించిన సితార సినిమాతో నేషనల్ అవార్డు కూడా దక్కించుకుంది. ఆ తర్వాత నటించిన స్వర్ణకమలం సినిమా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో స్థానాన్ని సంపాదించుకుంది.

ఇక భానుప్రియ భరతనాట్యం, కూచిపూడి నృత్యాలలో కొన్నేళ్లపాటు శిక్షణ తీసుకొని అనేక ప్రదర్శనలు సైతం ఇచ్చింది ప్రస్తుతం ఆమె సినిమాలు తగ్గించుకొని నృత్య శిక్షణ కూడా ఇస్తోంది. 1962లో భానుప్రియ ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. అప్పట్లో అందరు ఆమెను శ్రీదేవి అంటూ కూడా పిలిచేవారు. తెలుగులో ఉన్న అగ్ర హీరోలు అందరితో భానుప్రియ నటించింది. చిరంజీవి వంటి అగ్ర హీరోతో పోటాపోటీగా డ్యాన్స్ చేస్తూ ఉర్రూతలూగించింది.

ఇక భానుప్రియ చెల్లెలు శాంతి ప్రియ సైతం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొన్ని చిత్రాల్లో నటించింది. ఇక ఆమె సినిమా జీవితం అందరికీ తెరిచిన పుస్తకమే అయినప్పటికీ తన వైవాహిక జీవితం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ప్రముఖ నృత్యకారుని అయిన సుమతీ కౌశల్ యొక్క కుమారుడు ఆదర్శ్ కౌశల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది భానుప్రియ. దర్శకుడు వంశీతో భానుప్రియకి చాలా మంచి బంధం ఉందనేది అప్పట్లో అందరూ అనుకునే మాట.

కానీ ఆ తర్వాత కాలంలో ఏం జరిగిందో ఏమో కానీ ఆమె ఆదర్శ్‌తో ప్రేమలో పడింది. అయితే వీరి పెళ్లికి భానుప్రియ తల్లి ఒప్పుకోలేదు. భానుప్రియ తన తల్లి మాటకు ఎప్పుడు ఎదురు చెప్పేది కాదు, అంతే కాదు ఆమెకు తన తల్లి అంటే ఎంతో భయం కూడా..! కానీ ఆదర్శ్‌తో ప్రేమ వివాహం విషయంలో ఆమె వ్యతిరేకించడంతో తల్లిని కాదని అమెరికా వెళ్ళిపోయి అక్కడే పెళ్లి చేసుకుని సెటిల్ అయింది భానుప్రియ.

ఆదర్శ్ భానుప్రియ కు తగినవాడు కాదు అంటూ ఆమె తల్లి ఎంత చెప్పినా భానుప్రియ వినలేదు. చివరికి తన తల్లి చెప్పినట్టుగానే వీరిద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు భానుప్రియకి అభినయ అనే ఒక కూతురు కూడా ఉంది. ఇక కొన్నేళ్ల‌ క్రితం ఆదర్శ్ గుండెపోటుతో మరణించాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news