Moviesమ‌హేష్‌తో సినిమా... పూజా కండీష‌న్లు మామూలుగా లేవుగా...!

మ‌హేష్‌తో సినిమా… పూజా కండీష‌న్లు మామూలుగా లేవుగా…!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గత మూడేళ్లుగా ఇండ‌స్ట్రీలో ఓ వెలుగు వెలుగుతోంది. తెలుగులో చాలా త‌క్కువ టైంలోనే మ‌హేష్‌, ఎన్టీఆర్‌, బ‌న్నీ, వ‌రుణ్‌తేజ్, రామ్‌చ‌ర‌ణ్ ప‌క్క‌న న‌టించేసింది. ఇప్ప‌టికే పూజాను బ‌న్నీ రెండుసార్లు రిపీట్ చేయ‌గా.. ఇప్పుడు మ‌హేష్ కూడా మ‌రోసారి ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు. అటు కోలీవుడ్‌లో విజ‌య్ బీస్ట్ సినిమాలోనూ చేసింది. వ‌రుస‌గా క్రేజీ ఆఫ‌ర్లు. స్టార్ హీరోలు, డైరెక్ట‌ర్ల‌తో ఛాన్సులు రావ‌డంతో ప్ర‌స్తుతం పూజ ఆడింది ఆట‌గా.. పాడింది పాట‌గా మారింది.

అయితే ఇప్పుడు పూజ ఏకంగా పాన్ ఇండియా సినిమాల మీదే కాన్‌సంట్రేష‌న్ చేస్తోంది. దీంతో తెలుగు సినిమాలంటే చిన్న చూపు చూడ‌డంతో పాటు స‌వాల‌క్ష కండీష‌న్లు కూడా పెడుతోంద‌న్న విమ‌ర్శ‌లు కూడా తీవ్రంగా ఉన్నాయి. ఇక తాజాగా ఆమె మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ – మ‌హేష్ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతోన్న మ‌హేష్ 28వ ప్రాజెక్టులో న‌టిస్తోంది.

త్వ‌ర‌లోనే ప‌ట్టాలు ఎక్క‌నున్న ఈ సినిమాలో మ‌హేష్‌బాబు ప‌క్క‌న న‌టించేందుకు పూజా హెగ్డే చాలా కండీషన్లు పెట్టింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఒక్క‌టే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం పూజా హెగ్డే కేవ‌లం 45 రోజుల కాల్షీట్లు మాత్ర‌మే ఇచ్చింద‌ట‌. 45 రోజుల్లో షూటింగ్ పూర్తైపోవాల‌ని.. ఆ త‌ర్వాత తాను షూటింగ్‌కు రాన‌ని ఓపెన్‌గానే చెప్పిందంటున్నారు.

అయితే మ‌రో హీరోయిన్‌ను సెట్ చేయ‌మ‌ని మ‌హేష్ చెప్పినా.. త్రివిక్ర‌మ్ ఇప్పుడు పూజా వెంటే ప‌డుతుండ‌డంతో చివ‌ర‌కు ఆమెనే ఫిక్స్ చేశార‌ని అంటున్నారు. ఇది మ‌త్ర‌మే కాదు ఇప్పుడు పూజా ఒక్కో సినిమాకు రు. 3 కోట్ల నుంచి రు. 3.5 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోంది. దీంతో పాటు త‌నతో పాటు వ‌చ్చే త‌న టీం మెయింటినెన్స్ కూడా నిర్మాత‌లే భ‌రించాల‌ని కూడా కొత్త కండీష‌న్లు పెడుతోంద‌ట‌.

అయితే మ‌న తెలుగు నిర్మాత‌లు ప‌దే ప‌దే ఆమె వెంట‌పడుతున్న‌ప్పుడు ఆమె అడిగిన‌వి అన్ని ఇచ్చుకోవ‌డం మ‌నిహా వేరే గత్యంత‌రం లేద‌న్న‌ట్టుగా ఉంటున్నారు. దీంతో ఆమె ఎక్కిన చెట్టు దిగ‌డం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news