Moviesవామ్మో..నయనతార-విగ్నేశ్ శివన్ ఫస్ట్ నైట్ ఖర్చు అన్ని కోట్లా..?

వామ్మో..నయనతార-విగ్నేశ్ శివన్ ఫస్ట్ నైట్ ఖర్చు అన్ని కోట్లా..?

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార..ఇప్పుడు మిసెస్ విగ్నేశ్ శివన్ గా మారిపోయింది. పెళ్లికి ముందు ఎన్ని లవ్ స్టోరీలు నడిపినా..పెళ్లి తరువాత మాత్రం..అన్ని భర్తే అంటూ..సర్వం తన కష్టార్జితాన్ని అర్పిస్తుంది. అంతేకాదు, భర్త క్షేమం కోసం పూజలు కూడా చేస్తుందట. గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట..ఫైనల్లీ మహాబలిపురంలో ఒక్కటైయ్యారు.

చాలా రిచ్ గా..రాయల్ లుక్ లో..సాంప్రదాయాని పాటిస్తూ..ఓ రిసార్ట్ లో..అత్యంత దగ్గర సన్నిహితులు, ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల మధ్య ఒక్కటైయ్యారు ఈ జంట. వీళ్ల పెళ్లికి ధరించిన కాస్ట్యూమ్‌స్, నగలు..స్టార్ సెలబ్స్ పిక్స్..ఎప్పటికప్పుడు నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికి నయనతార హనీ మూన్ పిక్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. మెడలో తాళ్లి..భర్త కౌగిట్లో నయన్..అబ్బో పెళ్లి కానీ కుర్రాళ్ళను టెంప్ట్ చేస్తున్నాయి.

అయితే, తాజాగా సోషల్ మీడియాలో ఈ జంట ఫస్ట్ నైట్ గిఫ్ట్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం..నయన్ కు ఫస్ట్ నైట్ గిఫ్ట్ గా 2 కోట్లు విలువ చేసే డైమెండ్ రింగ్..అలాగే, ఆమె ఫేవరేట్ బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్ ను గిఫ్ట్ గా ఇచ్చారట. దీని ఖరీదు 2 లక్షలు అయిన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు, వాళ్ల ఫస్ట్ నైట్ రూమ్ ని కూడా చాలా ఢిఫరెంట్ గా డిజైన్ చేయించుకున్నారట. ఫస్ట్ నైట్ పూలు కోసం మాత్రమే మూడు లక్షలకు పైగా ఖర్చు చేసిన్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ రేంజ్ ఖర్చుతో ఫస్ట్ నైట్ ఎవ్వరు చేసుకోలేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నయన్ ఫస్ట్ నైట్ టూ కాస్ట్లీ..అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news