Moviesజై బాల‌య్యా అంటూ జై కొట్టిన మెగా ఫ్యామిలీ హీరోయిన్‌...!

జై బాల‌య్యా అంటూ జై కొట్టిన మెగా ఫ్యామిలీ హీరోయిన్‌…!

నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ హీరోగా న‌టిస్తూ, నిర్మిస్తోన్న సినిమా బింబిసార‌. మ‌గ‌ధ సామ్రాజ్యంలో ఉన్న ఓ రాజు జీవిత చ‌రిత్ర‌కు, ఈ త‌రం జ‌న‌రేష‌న్లో ఉన్న వ్య‌క్తికి క‌నెక్ట్ చేస్తూ పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. వాశిష్ట్ మ‌ల్లిడి అనే కొత్త ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేస్తూ క‌ళ్యాణ్‌రామ్ ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. నిన్న రిలీజ్ అయిన ట్రైల‌ర్ చూస్తే అంతా భారీత‌న‌మే క‌నిపించింది. ఏఎంబీ సినిమాస్‌లో అట్ట‌హాసంగా ఈ ట్రైల‌ర్ రిలీజ్ చేశారు.

ఈ ఈవెంట్‌లో మ‌ళ‌యాళ భామ సంయుక్త మీన‌న్‌కు నందమూరి ఫ్యాన్స్ నుంచి బిగ్ షాక్ త‌గిలింది. మ‌ల్లూవుడ్‌లో సూప‌ర్ ఫామ్‌లో ఉన్న ఈ అమ్మ‌డు తెలుగులో ఫ‌స్ట్ సైన్ చేసిన సినిమా బింబిసార‌. అయితే బింబిసార లేట్ అవ్వ‌డంతో ఆ సినిమా కంటే ముందు అమ్మ‌డు భీమ్లానాయ‌క్ సినిమాలో న‌టించాడు. ఈ సినిమాలో రానాకు జోడీగా న‌టించిన సంయుక్త న‌ట‌న‌కు తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.

అంతేకాదు ఇప్పుడు సంయుక్త ఏకంగా త్రివిక్ర‌మ్ దృష్టిలో ప‌డ‌డంతో ఆయ‌నే నేరుగా రిక‌మెండ్ చేస్తూ ఛాన్సులు ఇప్పించేస్తున్నాడంటున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ – సాయితేజ్ క‌లిసి న‌టిస్తోన్న సినిమాలో సంయుక్త సాయితేజ్ ప‌క్క‌న న‌టిస్తోంది. ఇలా వ‌రుస‌గా ఆమె మెగా కాంపౌండ్ హీరోలు న‌టిస్తోన్న సినిమాల్లో న‌టిస్తుండ‌డంతో ఆమెకు మెగా హీరోయ‌న్ అన్న ముద్ర ప‌డింది.

అయితే నిన్న బింబిసార ప్రి రిలీజ్ ఫంక్ష‌న్లో నంద‌మూరి అభిమానులు ఆమె చేత జై బాల‌య్యా అనిపించారు. బింబిసార ఈవెంట్‌లో సంయుక్త మాట్లాడుతుంటే నంద‌మూరి అభిమానులు జై బాల‌య్య అనాల‌ని అరుపులు, కేక‌లు వేశారు. దీంతో ఆమె జై బాల‌య్యా అనడంతో వాళ్ల ఉత్సాహానికి అవ‌ధులే లేవు. ఆ త‌ర్వాత వాళ్లు జై ఎన్టీఆర్‌, జై క‌ళ్యాణ్‌రామ్ అనాల‌ని కోర‌డంతో సంయుక్త అలాగే అని వాళ్ల‌ను మ‌రింత ఉత్సాహ‌ప‌రిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news