Moviesఈ స్టార్‌ హీరోల కూతుళ్లు ఏం చేస్తున్నారో తెలుసా.. ?

ఈ స్టార్‌ హీరోల కూతుళ్లు ఏం చేస్తున్నారో తెలుసా.. ?

సినిమా ఇండస్ట్రీ అంటేనే వారసత్వంతో నిండి ఉంటుంది. ఒక్కరు హీరో అయ్యారంటే చాలు వారి కుటుంబం నుంచి అనేక మంది స్టార్స్ లేదా హీరోలుగా ఇండస్ట్రీకి వస్తూనే ఉంటారు. దీంట్లో ఎంతో కొంత మినహాయింపు కూతుళ్ళకే ఉంది అలా మన ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ గా రాణిస్తున్న అనేక మంది హీరోలు తమ కూతుర్లని ఇండస్ట్రీకి తీసుకురాలేదు. అలా ఆ స్టార్ హీరో కూతుళ్లు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు అనే విషయాలను తెలుసుకుందాం.

 

ఇక ఇటీవల కాలంలో తిరుమల టెంపుల్ లో బాగా వైరల్ గా మారింది శ్రీకాంత్ కూతురు మేధా. హీరో శ్రీకాంత్ తన కొడుకు రోషన్ ని ఇప్పటికే హీరోగా పరిచయం చేశాడు రోషన్ హీరోగా సెటిల్ అయ్యే క్రమంలో ఉండగా మేధా మాత్రం డిగ్రీ చదువుతోంది ఆమెకు అస్సలు సినిమాల్లో ఇంట్రెస్ట్ లేదు అనే విషయం ప్రస్తుతం తెలుస్తోంది.

ఇక మాస్ రాజా రవితేజ కొడుకు కూడా ఇప్పటికే సినిమాలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలుసు. రవితేజ చిన్ననాటి పాత్రలో రాజా ది గ్రేట్ అనే సినిమాలో నటించి మెప్పించాడు. కానీ ఇప్పటివరకు రవితేజ కూతురిని మాత్రం బయట ప్రపంచానికి చూపించడం లేదు. రవితేజ కుమార్తె పేరు మోక్ష భూపతి రాజు. ప్రస్తుతం ఆమె ఫారిన్లో డిగ్రీ చదువుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక మనందరికీ తెలుసు వెంకటేష్ కి ముగ్గురు కూతుళ్లు ఉన్నారని. ఈ మధ్యకాలంలో వెంకటేష్ తన పెద్దమ్మాయికి పెళ్లి చేసి ఫారిన్ పంపించగా, రెండవ కూతురు హయావాహిని మాత్రం పై చదువుల నిమిత్తం ఫారిన్ లోనే ఉంటుంది. ఇక మూడవ కుమార్తె భావన కూడా తన చదువును పూర్తి చేసే పనిలోనే ఉంది. వెంకటేష్ కూతుర్లకి ఎవరికి కూడా ఇండస్ట్రీకి వచ్చే ఉద్దేశమే లేదు.

ఇక మరొక హీరో జగపతిబాబు, ఒకప్పుడు హీరోగా, ఇప్పుడు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో సంచలనాలకు మారుపేరుగా ఉన్న జగపతిబాబుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆ మధ్య కాలంలో పెద్ద కూతురికి పెళ్లి చేసి అమెరికా పంపించేశాడు. ఇక రెండవ కూతురు కూతురు మేఘన ప్రస్తుతం చదువుతోంది.

రెబల్ స్టార్ కృష్ణం రాజు కి కూడా ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి అలాగే సాయి ప్రదీప్తి. సాయి ప్రసీద ఇప్పటికే తన చదువులను పూర్తి చేసింది ఆమె ఎంబీఏ బిజినెస్ చేయడంతో ఏదైనా బిజినెస్ చేయాలనే ప్రయత్నంలో ఉంది. ఇక మిగతా ఇద్దరు కుమార్తెలు ప్రస్తుతం ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news