Movies40 ఏళ్ల అనుష్క ఎక్క‌డా త‌గ్గ‌ట్లేదు... ఈ వ‌య‌స్సులోనూ ఇంత రేటా...!

40 ఏళ్ల అనుష్క ఎక్క‌డా త‌గ్గ‌ట్లేదు… ఈ వ‌య‌స్సులోనూ ఇంత రేటా…!

స్విటీ బ్యూటీ అనుష్క టాలీవుడ్‌ను 16 ఏళ్ల‌కు పైగా ఏలుతూ వ‌స్తోంది. 2005లో పూరి జ‌గన్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సూప‌ర్ సినిమాతో ఆమె తెలుగు తెర‌కు హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది. ఆ సినిమాకు ముందు నాగ‌చైత‌న్య‌కు యోగా మాస్ట‌ర్‌గా ఉన్న ఆమెను పూరి జ‌గ‌న్నాథ్ చూసి న‌చ్చ‌డంతో హీరోయిన్‌ను చేసేశాడు. ఆ త‌ర్వాత ఆమె వెన‌క్కు తిరిగి చూసుకోలేదు.

ఇక టాలీవుడ్‌లో మాత్ర‌మే కాదు ఇటు త‌మిళ్‌, అటు క‌న్న‌డం, మ‌ళ‌యాళంలోనూ ఆమె అంద‌రు స్టార్ హీరోల‌తో న‌టించి సూప‌ర్ హిట్లు కొట్టింది. అస‌లు ఒకానొక టైంలో అనుష్క కాల్షీట్ల కోసం స్టార్ హీరోలే త‌మ సినిమాల షెడ్యూల్స్ వాయిదా వేసుకున్న సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. తెలుగులో నాగార్జున‌, ప్రభాస్ లాంటి హీరోలు అయితే అనుష్క‌నే స్వ‌యంగా త‌మ సినిమాల్లో హీరోయిన్‌గా రిక‌మెండ్ చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి.

ఇక బాహుబ‌లి దెబ్బ‌తో అనుష్క నేష‌న‌ల్ వైడ్‌గా మాత్ర‌మే కాదు.. ఇంట‌ర్నేష‌న‌ల్‌గా పాపుల‌ర్ అయిపోయింది. ఆ సినిమాలో అనుష్క పాత్ర చూసిన ఇండియ‌న్ సినీ ల‌వ‌ర్స్ ఆమెకు ఫిదా అయిపోయారు. బాహుబ‌లి త‌ర్వాత అనుష్క పెద్ద‌గా సినిమాలు చేయ‌లేదు. చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత న‌వీన్ పొలిశెట్టి హీరోగా ఓ సినిమాలో న‌టిస్తోంది.

నాలుగు ప‌దుల వ‌య‌స్సుకు చేరువ‌లో ఉన్నా కూడా అనుష్క రేంజ్‌, డిమాండ్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఆమె ఒక్కో సినిమాకు రు. 3 కోట్లు.. అదే కాస్త స్టార్ కాస్టింగ్‌తో పాటు పెద్ద హీరో, పెద్ద బ‌డ్జెట్ ఉంటే రు. 4 కోట్ల‌కు త‌గ్గేదేలే అంటోంద‌ట‌. పైగా సీనియ‌ర్ హీరోల‌కు హీరోయిన్ల కొర‌త ఉండ‌డంతో ఇప్పుడు ఆమె వెంటే ప‌డుతున్నార‌ట‌. దీంతో అనుష్క ఇదే అద‌నుగా రేటు విష‌యంలో కొండెక్కి కూర్చొంటోంద‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news