Moviesపూజా హెగ్డే VS ర‌ష్మిక ఇద్ద‌రి మ‌ధ్య వార్ ముదిరి పాకాన...

పూజా హెగ్డే VS ర‌ష్మిక ఇద్ద‌రి మ‌ధ్య వార్ ముదిరి పాకాన ప‌డిందా… ఇంత ర‌చ్చ న‌డుస్తోందా…!

నేష‌న‌ల్ క్ర‌ష్మిక ర‌ష్మిక మంద‌న్న వ‌ర్సెస్ పూజా హెగ్డే మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం ముదిరిపాకాన ప‌డిన‌ట్టుగా తెలుస్తోంది. అదేంటో కాని పూజా హెగ్డేకు ఎప్పుడూ ఏదో ఒక హీరోయిన్‌పై త‌న అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతున్న‌ట్టుగా ఉన్న‌ట్టే ఉంటుంది. గ‌తంలో స‌మంత‌కు ఆమె మ‌ధ్య లేనిపోని పొరాపొచ్చ‌లు వ‌చ్చాయి. సోష‌ల్ మీడియా వేదిక‌గా కూడా ఇద్ద‌రి అభిమానుల మ‌ధ్య పెద్ద పెద్ద మాట‌ల యుద్ధాలే న‌డిచాయి.

ఇక తాజా వార్ విష‌యానికి వ‌స్తే పూజా హెగ్డే తెలుగుతో పాటు అటు బాలీవుడ్‌లోనూ బిజీగా ఉంటూ వ‌చ్చింది. సౌత్‌లో టాలీవుడ్‌ను క‌మ్మేసిన ర‌ష్మిక అటు బాలీవుడ్‌లో కూడా ఫుల్ బిజీ అయిపోతోంది. ఇదే పూజా అవ‌కాశాల‌కు గండి కొట్టేస్తోంది. చివ‌ర‌కు ర‌ష్మిక సౌత్‌లో మంచి అవ‌కాశాలు వ‌స్తున్నా కాద‌నుకుని మ‌రీ బాలీవుడ్‌కే జై కొడుతోంది. పుష్ప‌తో ర‌ష్మికు వ‌చ్చిన పాన్ ఇండియా ఇమేజ్‌ను కంటిన్యూ చేస్తూ ప్ర‌స్తుతం ఆమె బాలీవుడ్‌లో మిష‌న్ మ‌జ్ను – గుడ్ బై – యానిమ‌ల్ సినిమాలు చేస్తోంది.

 

అయితే పూజా ఖాతాలో ప‌డాల్సిన ఈ సినిమాలు అన్నీ ఇప్పుడు ర‌ష్మిక ఖాతాలో ప‌డుతున్నాయి. దీంతో ర‌ష్మిక వ‌ర్సెస్ పూజా మ‌ధ్య ఇప్పుడు సౌత్ టు నార్త్ ఎక్క‌డ చూసినా ప్ర‌చ్ఛ‌న్న యుద్ధ‌మే న‌డుస్తోందంటున్నారు. ర‌ష్మిక బాలీవుడ్‌లో త‌న ఛాన్సులు త‌న్నుకు పోతుండ‌డంతో పూజా ఇప్పుడు తెలుగులో సినిమాలు ఒప్పుకుంటోంది. అది కూడా మ‌హేష్‌బాబు సినిమా ఒక్క‌టే ప్ర‌స్తుతం పూజా చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్టు.

పూజా హెగ్డేకు బాగా హెడ్ వెయిట్ అని.. ఆమె త‌ల‌బిరుసు త‌నం వ‌ల్లే ఆమె నార్త్‌లో చేజేతులా అవ‌కావాలు పోగొట్టుకుందని అంటున్నారు. ఆమె బాలీవుడ్ డెబ్యూ మూవీ మెహంజోదారో త‌న కెరీర్‌లోనే చేసిన చెత్త సినిమా అన‌డంతో బాలీవుడ్ మేక‌ర్స్ ఆమెపై మంట‌తో ఉన్నారు. ఆ త‌ర్వాత బాలీవుడ్లో ఆమె చేసిన సినిమాల‌పై కూడా లేనిపోని కామెంట్లు చేస్తూ త‌న యాట్యిట్యూడ్ చూపిస్తుండ‌డంతో ఆమెను అక్క‌డి వాళ్లు దూరం పెడుతున్నారు.

దీనికి తోడు ఆమె షూటింగ్‌కు వ‌స్తే త‌న టీంకు కూడా అన్నీ ఖ‌ర్చులు భ‌రించాల‌న్న డిమాండ్లు, కండీష‌న్లు పెడుతుండ‌డం కూడా నార్త్ వాళ్లు ఆమెను కాద‌ని ర‌ష్మిక వైపు చూస్తున్నార‌ట‌. పాన్ ఇండియా వైజ్‌గా పూజా కంటే ర‌ష్మికే ఎక్కువ క్రేజ్‌తో ఉంది. దీనికి తోడు స‌రైన టేమింగ్‌, రెమ్యున‌రేష‌న్ ప‌రంగా ప‌ట్టువిడుపుల‌తో ఉండ‌డంతో ఇప్పుడు అంద‌రూ ఆమె వెంటే ప‌డుతున్నారు బాలీవుడ్‌లో..!

స‌హ‌జంగానే త‌న ఛాన్సులు కొట్టేస్తుండ‌డంతో ర‌ష్మిక అంటే పూజాలో ఎక్క‌డా లేని కొత్త అస‌హ‌నం మొద‌లైంద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు పూజా ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో ర‌ష్మిక‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తున్నార‌ట‌. ఎవ‌రు ఎవ‌రిని టార్గెట్ చేసినా ఇక్క‌డ పూజా యాట్యిట్యూడే ఆమెకు మైన‌స్ అయ్యి.. ర‌ష్మికు ప్ల‌స్ అయ్యింద‌న‌డంలో సందేహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news