Moviesవామ్మో..ఏంటిది..అల్లు అర్జున్ పై ఇలాంటి రూమర్..అస్సలు ఊహించలేదే..?

వామ్మో..ఏంటిది..అల్లు అర్జున్ పై ఇలాంటి రూమర్..అస్సలు ఊహించలేదే..?

యస్..గత వారం రోజుల నుండి ఇండస్ట్రీలో ఓ వార్త తెగ వైరల్ గా మారింది. ఆ రూమర్ చిన్న చితకా హీరోల పై అయ్యుంటే జనాలు పెద్దగా పట్టించుకునే వారు కాదు. స్టైలీష్ స్టార్ లాంటి పాన్ ఇండియా హీరో కావడంతో..అభిమానుల్లో పాటు..స్టార్స్ కూడా బన్నీ తీసుకున్న నిర్ణయం పై ఆలోచిస్తున్నారు. మనకు తెలిసిందే..బన్నీ పాన్ ఇండియా సినిమా గా కెరీర్ లో తొలిసారి నటించిన సినిమా “పుష్ప”. సుకుమార్ డైరెక్షన్ లో 2021 డిసెంబరు 17న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఈ సినిమాలో ఫస్ట్ టైం బన్నీ ఫుల్ లెంత్ లో ఊర మాస్ లుక్ లో కనిపించి..మెప్పించాడు. సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్నా కూడా..డి గ్లామరస్ లుక్ లో అదరకొట్టేసింది. ఈ సినిమాకి మెయిన్ ప్లస్ సమంత ఐటేం సాంగ్..ఇండియాని ఓ ఊపు ఊపేసింది ఈ పాట. అయితే, ఈ సినిమా రెండు పార్ట్ లు గా తెరకెక్కబోతుందని డైరెక్టర్ ముందే ప్రకటించారు. నిజానికి “పుష్ప-ది రూల్” కూడా డిసెంబరు 17,2022 రిలీజ్ చెయ్యాలి అని అనుకున్నారు. కానీ, ప్రజెంట్ సిట్యువేషన్ చూస్తుంటే..అది సాధ్యపడే పనిలా కనిపించట్లేదు.

నిజానికి పుష్ప పార్ట్ 2 సినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సింది . కానీ, కొన్ని అనివార్య కారణాల చేత..సినిమా లేట్ అవుతూ వచ్చింది. సినిమాలోకి కొత్త వాళ్లను తీసుకోవాలని సుకుమార్ అనుకోవడం..రాసుకున్న స్క్రిప్ట్ లో ఛేంజస్ చేయడంతో షూటింగ్ మరింత లేట్ అవుతున్నట్లు తెలుస్తుంది. కాగా, ఈ సినిమా గురించి..ఓ రూమర్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారింది.

సినిమాలో బన్నీ 54 ప్లస్ గెటప్ లో కనిపించనున్నాడట. నాలుగు ప‌దులు వ‌య‌సున్న ఓ హీరో ఐదున్న‌ర ప‌దులున్న వ్య‌క్తిగా క‌నిపించ‌టం అంటే కాస్త రిస్కీ విష‌య‌మే. కానీ.. స‌బ్జెక్ట్ డిమాండ్ మేర‌కు బ‌న్నీ అలా యాక్ట్ చేయ‌టానికి ఒప్పుకున్నారని స‌మాచారం. పుష్ప పార్ట్ 1 లో బన్నీకి పెళ్లి అయిపోయింది. పార్ట్ 2 లో ఇద్దరు పిల్లలు కూడా ఉండేలా స్టోరీ ఉండబోతుందట. అందుకోసం చిత్ర యూనిట్ ఓ యంగ్ హీరో, హీరోయిన్‌ని వెతికే ప‌నిలో ప‌డ్డార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మరి చూడాలి సుకుమార్ ఏం చేస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news