Moviesటాప్‌లేపిన ' స‌ర్కారు వారి పాట ' క‌లెక్ష‌న్లు... రికార్డు స్థాయి...

టాప్‌లేపిన ‘ స‌ర్కారు వారి పాట ‘ క‌లెక్ష‌న్లు… రికార్డు స్థాయి ఓపెనింగ్స్‌…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన సినిమా స‌ర్కారు వారి పాట‌. స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత రెండేళ్ల‌కు పైగా గ్యాప్ తీసుకుని మ‌హేష్ ఈ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. దీనికి తోడు టీజ‌ర్లు, ట్రైల‌ర్లు కూడా ఆక‌ట్టుకోవ‌డంతో స‌ర్కారుపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రీమియ‌ర్ల నుంచే పాజిటివ్ టాక్ వ‌చ్చేసింది.

కొన్ని కొన్ని లోపాలు ఉన్నా ఎవ్వ‌రి నోటా మిక్స్ డ్ టాక్ లేదు. హిట్‌.. సూప‌ర్ హిట్ టాకే వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఏపీ, తెలంగాణ‌లో మ‌ల్టీఫ్లెక్స్‌లు, ఏ సెంట‌ర్‌, బీ సెంట‌ర్ అన్న తేడా లేకుండా అడ్వాన్స్ బుకింగ్‌లు భారీ ఎత్తున జ‌రుగుతున్నాయి. ఇక మ‌హేష్ సినిమా వ‌స్తుంది అంటే ఓవ‌ర్సీస్‌లో ఎంత హంగామా ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. ఓవ‌ర్సీస్‌లో ఏ తెలుగు హీరోకులేని విధంగా వ‌రుస‌గా ఆరు మిలియ‌న్ డాల‌ర్ల సినిమాలు ఉన్నాయి.

చివ‌ర‌కు పెద్ద డిజాస్ట‌ర్లు అయిన బ్ర‌హ్మోత్స‌వం, స్పైడ‌ర్ సినిమాలు కూడా అక్క‌డ మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు రాబ‌ట్టాయి. ఇక స‌ర్కారు వారి పాట కూడా రిలీజ్‌కు ముందే అదిరిపోయే అడ్వాన్స్‌ల‌తో ఓవ‌ర్సీస్‌ను షేక్ చేసింది. అక్క‌డ అడ్వాన్స్ బుకింగ్‌లు స్టార్ట్ అయిన రోజు నుంచే అదిరిపోయే నెంబ‌ర్స్ న‌మోదు చేసింది.

ఈ సినిమాకు ఓవ‌ర్సీస్ ప్రీమియ‌ర్స్ నుంచే 8 లక్షల 25 వేల డాలర్స్ వచ్చినట్టు తెలుస్తుంది. అంటే 1 మిలియ‌న్‌కు చేరువ‌లో ఉంది. ప్రీమియ‌ర్స్‌తోనే ఈ రేంజ్ వసూల్లు వ‌చ్చాయంటే… ఫ‌స్ట్ డే ఫిగ‌ర్స్ వ‌చ్చే స‌రికి 1.3 – 1.5 మిలియ‌న్ డాల‌ర్లు క్రాస్ చేస్తుంద‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news