Moviesఆగ‌ని ' అన్‌స్టాప‌బుల్ ' రికార్డుల వేట‌... నేష‌న‌ల్ లెవ‌ల్లో టాప్...

ఆగ‌ని ‘ అన్‌స్టాప‌బుల్ ‘ రికార్డుల వేట‌… నేష‌న‌ల్ లెవ‌ల్లో టాప్ లేపే రికార్డు…!

ఏ ముహూర్తాన బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షో చేస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న వ‌చ్చిందో ఈ షోపై చాలా మంది చాలా సందేహాలు వ్య‌క్తం చేశారు. క‌ట్ చేస్తే అన్‌స్టాప‌బుల్ షో దెబ్బ‌కు బుల్లితెర రికార్డులు అన్నీ తునాతున‌క‌లు అయిపోయాయి. అస‌లు బాల‌య్య ఎన‌ర్జీ… ఆయ‌న ప్ర‌శ్న‌లు వేసి.. ఆన్స‌ర్లు రాబ‌ట్టుకునే తీరు… అస‌లు అన్‌స్టాప‌బుల్ షోతో అరాచ‌కం చూపించాడు. ఈ దెబ్బ‌తో ఈ త‌రం జ‌న‌రేష‌న్ అభిమానుల‌కు కూడా బాల‌య్య పిచ్చ పిచ్చ‌గా క‌నెక్ట్ అయిపోయాడు.

ఈ షోతో బాల‌య్య త‌న‌కు తానుగా స‌రికొత్త‌గా ఆవిష్క‌రించుకున్నాడు. అస‌లు అఖండ‌కు ఈ రేంజ్‌లో క‌లెక్షన్లు రావ‌డానికి ఈ షో కూడా ఓ కార‌ణ‌మే అన్న చ‌ర్చ కూడా ఉంది. ఏదేమైనా సోష‌ల్ మీడియాలో బాల‌య్య ఫాలోవ‌ర్స్ భీభ‌త్సంగా పెరుగుతున్నారు. బుల్లితెర‌పై గ‌తంలో కింగ్ నాగార్జున బిగ్‌బాస్‌, మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోల‌కు హోస్ట్‌గా చేశారు.

ఇటు చిరు కూడా మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోను హోస్ట్ చేశారు. నేచుర‌ల్ స్టార్ నాని సైతం బిగ్‌బాస్ హోస్ట్ చేశారు. ద‌గ్గుబాటి రానా నెంబ‌ర్ 1 యారీని హోస్ట్ చేశారు. వీళ్ల‌ను తోసి రాజ‌ని బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షో హోస్ట్‌గా త‌న ముద్ర వేసుకున్నారు. ఈ షో అత్య‌ధిక వ్యూస్ తెచ్చుకున్న షోగా ఇప్ప‌టికే రికార్డులు క్రియేట్ చేసింది. ఈ షో దెబ్బ‌తోనే అల్లు వారి ఆహా సబ్‌స్క్రైబ‌ర్లు కూడా విప‌రీతంగా పెరిగారు.

ఈ క్ర‌మంలోనే ఈ షో ఖాతాలో మ‌రో రికార్డు వ‌చ్చి చేరింది. సెల‌బ్రిటీ టాక్ షోల్లో నెంబ‌ర్ వ‌న్ టాక్ షోగా రికార్డుల‌కు ఎక్కిన ఈ షో ఖాతాలో తాజాగా మ‌రో రెండు సిల్వ‌ర్ ట్రోఫీలు వ‌చ్చి చేరాయి. బెస్ట్ రీజ‌న‌ల్ టీవీ ప్రోగ్రామ్ – బెస్ట్ రీజ‌న‌ల్ టీవీ రియాలిటీ షోలో భాగంగా ఈ షో ఖాతాలో రెండు సిల్వ‌ర్ ట్రోఫీలు వ‌చ్చి చేరాయి. దీనిని బ‌ట్టే ఈ షో జాతీయ స్థాయిలో ఎంత క్రేజ్ తెచ్చుకుందో అర్థ‌మ‌వుతోంది.

ఇక అఖండ స‌క్సెస్ త‌ర్వాత బాల‌య్య ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ చేస్తున్నాడు. మైత్రీవాళ్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య అనిల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో మ‌రో సినిమా చేస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news