Movies41 ఏళ్లకి నమిత ప్రెగ్నెంట్..ప్రభాస్ ని ఆడేసుకుంటున్న నెటిజన్స్ ..!!

41 ఏళ్లకి నమిత ప్రెగ్నెంట్..ప్రభాస్ ని ఆడేసుకుంటున్న నెటిజన్స్ ..!!

తమ అంద చందాలతో ఇండస్ట్రీని ఏలేసిన సుందరిమణులు అంతా ఇప్పుడు పెళ్లిలు చేసుకుని..పిల్లలు తో సెటిల్ అయిపోయారు. ఈ మధ్యనే టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తన చిన్న నాటి ఫ్రెండ్ గౌతం ని పెళ్లి చేసుకున్న కాజల్ వెంటనే ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుని..అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఇక పవన్ మరదలు..అదే అత్తారింటికి దారేది సినిమాలో నటించిన ప్రణతి కూడా తాను గర్భవతి ని అంటూ బేబీ బంప్ ఫోటోలు రిలీజ్ చేసింది. ఇక ఇప్పుడు ప్రభాస్ హీరోయిన్ వంతు వచ్చింది.

తెలుగులో ‘సొంతం’, జెమిని, బిల్లా, సింహా తదితర చిత్రాల్లో అలరించిన నమిత.. త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. తెలుగులో సొంతం సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన న‌మిత‌..తర్వాత కోలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. కోలీవుడ్‌లో అమ్మ‌డు కాస్త బొద్దుగా ఉండ‌టంతో త‌మిళ తంబీలు ఆమెకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. పక్కాగా చెప్పాలంటే ఒకానోక టైంలో కోలీవుడ్‌ని ఏలేసిన హీరోయిన్ ఈమె. వరుస్ సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా షూటింగ్ లు చేసింది. ఇక ఆ తరువాత అమ్మడు అందాలు ఆకట్టుకోలేకపోయాయి. ఏవో అరా కొరా సినిమాలు చేసినా..పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.

ఆ తరువాత గుట్టు చప్పుడు కాకుండా..కోలీవుడ్ యాక్ట‌ర్ వీరేంద్ర చౌద‌రిని.. 2017లో సింపుల్ గా వివాహం చేసుకున్న నమిత..నిన్న తన పుట్టిన రోజు సంధర్భంగా..అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లి కాబోతున్న విషయాని అధికారికంగా చెప్పుతూ బేబీ బంప్ ఫోటోలను పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ అంటూ విషేస్ చెప్పుతున్నారు. కానీ కొందరు ఆకతాయి ట్రోలర్స్..ఆమెను ఈ వయసులో తల్లి అవ్వడం పై వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు.

నువ్వు ఇంకా సర్వీస్ లో ఉన్నావా అంటూ పిచ్చి గా వాగుతున్నారు. మరికొందరు ఈ మ్యాటర్ లోకి ప్రభాస్ ని లాగుతూ..” నీతో నటించిన కాజల్, నమిత లకి పెళ్లి అయ్యి..బిడ్డలు కూడా పుట్టేస్తున్నారు . నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావయ్య..”అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ప్రభాస్ బిల్లా సినిమాలో నమిత హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news