Moviesకెరీర్ లో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ ఓకే చేసిన శ్రీలీల..ఏ...

కెరీర్ లో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ ఓకే చేసిన శ్రీలీల..ఏ హీరో కోసం అంటే..?

వామ్మో .. ఇది నిజంగా శ్రీ లీల అభిమానులకి దిమ్మతిరిగిపోయే మైండ్ బ్లాక్ అయిపోయే న్యూస్ అని చెప్పాలి. శ్రీలీల అంటే చిన్న అమ్మాయి.. అందంగా నటిస్తుంది.. లేత అందాలతో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తుంది. బాగా డాన్స్ చేస్తుంది. ఇంతవరకే తెలుసు అయితే శ్రీ లీల బోల్డ్ నిర్ణయాలు కూడా తీసుకుంటుందా ..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . రీసెంట్గా శ్రీలీల తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది.

గుంటూరు కారం సినిమా తర్వాత హ్యూజ్ ట్రోలింగ్ కి గురి అయిన శ్రీ లీల.. ఇప్పుడు ఒక్కొక్క నిర్ణయాన్ని మైండ్ బ్లాక్ అయిపోయే రేంజ్ లో తీసుకుంటుంది నిన్న కాకముందే కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో అజిత్ తో నటించడానికి ఓకే చేసినట్లు వార్తలు వినిపించాయి. ఈ సినిమాలో ఆమె అజిత్ సరసన హీరోయిన్గా నటిస్తూ ఉండడం నటించడానికి ఓకే చెప్పడం అందరికీ దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది .

ఇప్పుడు అంతకుమించిన రేంజ్ లో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఫర్ ద ఫస్ట్ టైం కెరియర్ లో ఐటెం సాంగ్ చేయబోతుందట శ్రీ లీల . అది కూడా కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో విజయ్ తళపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమాలో శ్రీ లీల ఐటమ్ సాంగ్ ఓకే చేసినట్లు ప్రచారం జరుగుతుంది . ఈ సినిమాల్లో ఐటమ్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటిఫుల్ కూడా అప్రోచ్ అయ్యారట . వాళ్ళందరూ రిజెక్ట్ చేశారట.. ఫైనల్లీ పాటకు ఓకే చేయడం అభిమానులకి షాకింగ్ అనిపిస్తుంది . శ్రీ లీల లెక్కలు ఏంటో అర్థం కావడం లేదు అంటూ గుర్రుగా ఉంటున్నారు ఆమె అభిమానులు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news