Moviesవార్నీ బన్నీ నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ ఆ డైరెక్టర్ తోనా..? ఏదేదో...

వార్నీ బన్నీ నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ ఆ డైరెక్టర్ తోనా..? ఏదేదో ఊహించుకున్నాముగా..!

ఏదో ఊహించుకుంటే ఇంకేదో జరిగింది అన్నట్లు .. మనం బన్నీ నెక్స్ట్ ఏ స్టార్ డైరెక్టర్ సినిమాలో నటించబోతున్నాడు అంటూ నెత్తి – నోరు – బుర్ర అన్ని పీక్కున్నాము.. ఫైనల్లీ బన్నీ తనకు నచ్చిన డైరెక్టర్ కే కమిట్ అయ్యాడు అంటూ తెలుస్తుంది . సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . గత కొంతకాలంగా బన్నీ పుష్ప 2 సినిమా తర్వాత మరో బిగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వబోతున్నాడు అని .. ఆ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోతుంది అంటూ ప్రచారం జరిగింది . అంతేనా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో మూవీకి ఫిక్స్ అయ్యాడు అని .. ఈ సినిమాలో హీరోయిన్గా సమంత త్రిష నటించబోతున్నారు అని అదేవిధంగా అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేయబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి.

సీన్ కట్ చేస్తే అదంతా ఓకే నిజమే కానీ పుష్ప సినిమా తర్వాత బన్నీ చేయబోయే సినిమా మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తోనే అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . ఆల్రెడీ బన్నీ సినిమా కోసం కాల్ షీట్స్ కూడా అడ్జస్ట్ చేసేసాడట . కానీ ఎప్పటిలా కాకుండా.. ఈసారి కేవలం మూడు అంటే మూడు నెలలు మాత్రమే కాల్ షీట్స్ ఇచ్చారట. ఈ మూడు నెలల లోపే తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసేసి అట్లీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాపై కాన్సన్ట్రేషన్ చేయబోతున్నాడట .

అంతేకాదు ఇది ఫుల్ టు ఫుల్ ఫ్యామిలీ లవ్ డ్రామా సెంటిమెంట్ గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. అట్లీ అంటే పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తాడు. కనుక ఆయనకు ఎక్కువ కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది . త్రివిక్రమ్ మనోడే .. మనకు తెలిసిన వాడే.. మన ఇంటి మనిషే .. మరి అలాంటి డైరెక్టర్ కి కొన్ని కాల్ షీట్స్ ఇచ్చిన అడ్జస్ట్ చేసుకుంటాడు అన్న భావనతోనే అల్లు అర్జున్ ఇలా చేశాడట. మొత్తానికి అల్లు అర్జున్ ఏ డైరెక్టర్ ని నొప్పించకుండా సేఫ్ జోన్ లో సైడ్ గా తన పని తాను చేసుకుపోతున్నాడు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news