MoviesNTR - శంక‌ర్ కాంబినేష‌న్ వెన‌క 8 ఏళ్లుగా ఇంత క‌థ...

NTR – శంక‌ర్ కాంబినేష‌న్ వెన‌క 8 ఏళ్లుగా ఇంత క‌థ న‌డిచిందా…!

వామ్మో ఎన్టీఆర్ త‌న కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఎన్టీఆర్ 20 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాలు చేసినా కూడా పాన్ ఇండియా లెవ‌ల్ సినిమా చేయ‌లేదు. ఎట్ట‌కేల‌కు తాజాగా వ‌చ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఈ కోరిక తీరింది. త్రిబుల్ ఆర్ వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 1200 కోట్ల వ‌సూళ్ల‌కు చేరువ‌లో ఉంది. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేస్తున్నాడు. వ‌చ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఆ త‌ర్వాత మైత్రీ మూవీస్ వారు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించే పాన్ ఇండియా మూవీని ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో చేయ‌నున్నాడు.

ఈ క్రేజీ లైన‌ప్‌లో ఇప్పుడు మ‌రో అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చేసింది.. అదే ఎన్టీఆర్ – ఏ 1 డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌. ఈ నెల 20 త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు త్రిబుల్ ధ‌మాకా ఇస్తాడ‌ని అంటున్నారు. అదే రోజు కొర‌టాల శివ సినిమా గురించి ఏదో ఒక అప్‌డేట్ ఉంటుంద‌ని.. అలాగే ప్ర‌శాంత్ నీల్ సినిమా అప్‌డేట్‌తో పాటు శంక‌ర్ సినిమా గురించి ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని తెలుస్తోంది.

శంక‌ర్ అన్ని సినిమాలు తెలుగులో కూడా హిట్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఐ సినిమాకు ముందు నుంచే ఆయ‌న స్ట్రైట్ తెలుగు సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. వాస్త‌వంగా శంక‌ర్ ముందుగా ఎన్టీఆర్‌తోనే నేరుగా తెలుగు సినిమా ప్లాన్ చేసుకున్నా… స‌డెన్‌గా దిల్ రాజు ఎంట్రీతో అది రామ్‌చ‌ర‌ణ్ ప్రాజెక్టుగా మారింది. ఇక ఎన్టీఆర్‌తో సినిమా చేస్తాన‌ని శంక‌ర్ 8 సంవ‌త్స‌రాల క్రిత‌మే చెప్పాడ‌ట‌.

అయితే ఇది నిజం అవుతుందా ? అని ఎన్టీఆర్ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఇటు ఎన్టీఆర్ త‌న ప్రాజెక్టుల్లో బిజీగా ఉండ‌గా.. అటు శంక‌ర్ కూడా వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టులే చేసుకుంటూ వ‌స్తున్నాడు. రోబో – ఐ – 2.0 త‌ర్వాత ఇప్పుడు ఇటు చ‌ర‌ణ్ ప్రాజెక్టుతో పాటు అటు భార‌తీయుడు 2 సినిమాల‌పై ఒకేసారి ప‌ని చేస్తున్నాడు.

8 ఏళ్ల క్రితం శంక‌ర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తాన‌ని నేరుగా చెప్పినా అది జ‌రుగుతుందా ? అన్న సందేహాల‌కు ఇప్పుడు ఆన్స‌ర్ వ‌చ్చేసింది. స‌లార్ త‌ర్వాత ఈ సినిమా ఉంటుంద‌ని.. ఈ లోగా శంక‌ర్ చ‌ర‌ణ్ ప్రాజెక్టుతో పాటు అటు భార‌తీయుడు 2 ఫినిష్ చేసేస్తాడ‌ట‌. ఇప్ప‌టికే శంక‌ర్ ఎన్టీఆర్‌కు క‌థ చెప్ప‌గా ఎన్టీఆర్ చిన్న చిన్న మార్పుల‌తో ఓకే చేసిన‌ట్టే తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news