Moviesవ‌స్తావా నీ రేటెంత‌... ఈ న‌టికి టార్చ‌ర్ మామూలుగా లేదా..!

వ‌స్తావా నీ రేటెంత‌… ఈ న‌టికి టార్చ‌ర్ మామూలుగా లేదా..!

సినిమా సెల‌బ్రిటీలు ప‌బ్లిక్ ఫిగ‌ర్స్‌గా ఉంటారు. వీరు సినిమాల వ‌ర‌కు ప‌బ్లిక్ ఫిగ‌ర్సే.. టాప్ సెల‌బ్రిటీలే… అయితే వీరికి ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో సామాన్య మాన‌వుల్లాగానే చాలా బాధ‌లు.. క‌ష్టాలు ఉంటాయి. ఎవ‌రి జీవితం వాళ్ల‌కు మామూలుగానే ఉంటుంది. అయితే కొన్ని సార్లు సినిమా ప్రేక్ష‌కులు, కొంద‌రు ఆక‌తాయిలు.. వీరి ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లోకి కూడా వ‌చ్చేసి ఇబ్బందులు పెడుతూ ఉంటారు. దీంతో సినిమా వాళ్ల‌కు.. ముఖ్యంగా హీరోయిన్ల‌కు, న‌టీమ‌ణుల‌కు చాలా ఇబ్బందులు త‌ప్ప‌వు. ఈ క్ర‌మంలోనే ఎంతో మంది హీరోయిన్లు మీ టు ఉద్య‌మంతో బ‌య‌ట‌కు వ‌చ్చి త‌మ‌కు ఎదురైన వేధింపులు, లైంగీక వేధింపుల గురించి ప‌బ్లిక్‌గానే మాట్లాడుతున్నారు.

ఇక సోష‌ల్ మీడియా యుగం కావ‌డంతో హీరోయిన్లు, న‌టీమ‌ణుల ఫోన్ నెంబ‌ర్లు ఏదోలా లీక్ అయితే చాలు వాళ్ల‌కు చుక్క‌లు చూపించేస్తూ ఉంటారు. దీనిపై ఎన్ని సైబ‌ర్ క్రైం ఫిర్యాదులు వెళ్లినా ఆక‌తాయిలు మాత్రం త‌మ ప‌నులు మాన‌రు. తాజాగా బాలీవుడ్ బుల్లితెర నటి విభూతి ఠాకూర్‌కి ఇలాంటి ఒక చేదు అనుభవమే ఎదురైంది. ఆమెను కొంద‌రు సోష‌ల్ మీడియాలో మాతో వాస్తావా ? నీ రేటు ఎంత ? అని మెసేజ్‌లు పెట్టి వేధిస్తున్నార‌ట‌.

కొద్ది రోజులుగా భ‌రిస్తూ వ‌స్తోన్న ఆమె ఈ విష‌యాన్ని ఇటీవ‌ల భ‌య‌ట పెట్టింది. త‌న ప‌ర్స‌న‌ల్ నెంబ‌ర్ ఎలా లీక్ అయ్యిందో తెలియ‌దు.. అని ఆ నెంబ‌ర్‌కు వాట్సాప్ మెసేజ్ పెట్టి వ‌స్తావా చెప్పు.. నీ రేటెంత అని వేధిస్తున్నారంటూ ఆమె వాపోయింది. ఆ నెంబ‌ర్ లీక్ అయిన‌ప్ప‌టిన ఉంచి త‌న‌కు కంటిన్యూగా మెసేజ్‌లు వ‌స్తూనే ఉన్నాయ‌ని చెప్పింది.

అయితే రాను రాను ఈ మెసేజ్‌లు మ‌రి అస‌భ్య‌క‌రంగా ఉండ‌డంతో షాక్ తిన్నాన‌ని.. నా రేటు ఎంత అని అడ‌గ‌డంతో పాటు ర‌మ్మ‌ని వేధింపులు ఎక్కువ అవుతున్నాయ‌ని.. దీంతో బ‌య‌ట‌కు రాక త‌ప్ప‌లేదు అని ఠాగూర్ చెప్పింది. ఈ క్ర‌మంలోనే పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో పాటు ప‌లు ఆధారాలు కూడా స‌మ‌ర్పించింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news