Moviesఆంటీతో రామ్‌చ‌ర‌ణ్ రొమాన్స్‌.. ఈ జోడీ ఎలా సెట్ అయ్యిందంటే...!

ఆంటీతో రామ్‌చ‌ర‌ణ్ రొమాన్స్‌.. ఈ జోడీ ఎలా సెట్ అయ్యిందంటే…!

టాలీవుడ్ మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇప్పుడు త్రిబుల్ ఆర్ స‌క్సెస్ మామూలుగా ఎంజాయ్ చేయ‌డం లేదు. అప్పుడెప్పుడో వ‌చ్చిన విన‌య విధేయ రామ లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత మూడేళ్ల పాటు అస‌లు థియేట‌ర్ల‌లోకే రాలేదు. ఎట్ట‌కేల‌కు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన పాన్ ఇండియా మూవీ త్రిబుల్ గ‌త నెల 25న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. పాన్ ఇండియా లెవ‌ల్లో వ‌చ్చిన ఈ సినిమా ఇప్ప‌టికే రు. 900 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు కొల్ల‌గొట్టి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూసుకుపోతోంది.

ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ పోషించిన అల్లూరి సీతారామ‌రాజు పాత్రకు నార్త్‌లో కూడా అదిరిపోయే ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. త్రిబుల్ ఆర్ స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న చ‌ర‌ణ్ ఈ నెల‌లోనే మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న తండ్రితో క‌లిసి చ‌ర‌ణ్ న‌టించిన ఆచార్య సినిమా ఈ నెల 29న భారీ ఎత్తున ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సినిమాలో చెర్రీకి జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది.

 

ఇక నెల రోజుల గ్యాప్‌లో రెండు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చ‌ర‌ణ్ ఇప్పుడు ఏస్ వ‌న్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న త‌న 15 సినిమాలో కూడా న‌టిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా బ‌డ్జెట్ రు. 200 కోట్లు అని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల తెర‌కెక్కించిన ఓ పాట‌కే ఏకంగా రు. 10 కోట్లు పెట్టారు. అలాగే మరో ఫైట్‌కు కూడా రు. 10 కోట్లు పెట్టిన‌ట్టు తెలుస్తోంది. దీనిని బ‌ట్టే ఈ సినిమా ఏ రేంజ్లో తెర‌కెక్కుతోందో అర్థ‌మ‌వుతోంది.

ఈ సినిమాలో చెర్రీకి జోడీగా కియారా అద్వానీ న‌టిస్తోంది. ఆమె తెలుగుతో గ‌తంలో మ‌హేష్‌బాబు భరత్ అనే నేను సినిమాతో పాటు చెర్రీకి జోడీగా విన‌య విధేయ రామ సినిమా చేసింది. ఇప్పుడు మ‌రోసారి జోడీ క‌డుతోంది. ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. చెర్రీ రెండు వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో క‌నిపిస్తాడ‌ట‌. స్టూడెంట్ పాత్ర‌కు కియారా జోడీగా క‌నిపిస్తే…. తండ్రి పాత్ర‌కు జోడీగా ముదురు భామ అంజ‌లి క‌నిపించ‌బోతోంద‌ట‌.

అంజ‌లి ఇప్ప‌టికే ముదురు ఏజ్‌లోకి వ‌చ్చేసింది. సీనియ‌ర్ హీరోల‌కు జోడీగా క‌నిపిస్తోంది. మ‌రి ఇలాంటి ముదురు భామ చెర్రీ ప‌క్క‌న ఎలా సెట్ అవుతుందో ? శంక‌ర్ ఈ జంట‌ను ఎలా చూపిస్తాడో ? చూడాలి.
ఇటీవ‌లే ఈ సినిమా రాజ‌మండ్రి షెడ్యూల్ కంప్లీట్ చేసింది. ప్ర‌స్తుతం షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చారు. నెక్ట్స్ షెడ్యూల్ దుబాయ్‌లో ప్లాన్ చేస్తున్నాడు శంక‌ర్‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news