Moviesటూ లేట్ బేబీ.. అంతా అయిపోయింది..ఇక చక్క భజనే..!

టూ లేట్ బేబీ.. అంతా అయిపోయింది..ఇక చక్క భజనే..!

సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్సంకి కొదవ ఏం లేదు.. బోలెడు మంది హీరోయిన్స్ ఉన్నా కానీ..రోజుకో కొత్త హీరోయిన్ తెర పై ఎంట్రీ ఇస్తూనే ఉంటుంది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండ్రస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన తరువాత పక్క ఇండ్రస్ట్రీలవైపు హీరోయిన్ లు చూడడం కామన్ హా మారిపోయింది. ఈమధ్యకాలంలో వచ్చిన హీరోయిన్ లు అయితే తెలుగు, తమిళ్ రెండు ఇండ్రస్ట్రీలను బేలన్స్ చేసుకుని మరీ నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్లు సమంత, కాజల్, తమన్నా వంటి గ్లామర్ హీరోయిన్ లు తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ, పక్క భాష ఇండస్ట్రీలో అవకాశాలు రాగానే మన ఇండస్ట్రీ పై ఘాటు వ్యాఖ్యలు చేయడం బాధాకరంగా మారాతుంది.

అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ‘ఊహలు గుసగుసలాడే ‘సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ అందాల భామ రాశీ ఖన్నా.. ఆ తరువాత సుప్రీమ్ సినిమాలో సాయిధరమ్ సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత తరువాత మెల్లిగా ఒక్కొక్క హిట్ సినిమాలో నటిస్తూ టాప్ రేంజ్ కి చేరుకుంది.ఇక తెలుగు లో సినిమా లు హిట్ కావడం ఈ ముద్దుగుమ్మ కి తమిళంలో ఆఫర్లు వచ్చాయి. ఈ మధ్య బాలీవుడ్ లో వెబ్ సిరీస్ చేసి తన నటనకు మంచి మార్కులు వేయించుకుని..స్టార్ హీరో సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది.

ఇక ఈ మధ్యనే సౌత్ సినిమాలో హీరోయిన్ కి వాల్యూ ఇవ్వరని.. అక్కడ సినిమాలు చేసి బోర్ కొట్టిందని రాశిఖన్నా ఓ రేంజ్ లో సౌత్ ఇండస్ట్రీని ఏకిపారేసిందంటూ వార్తలు వినిపించాయి. దీంతో సౌత్ సినీ ప్రియులు హీరోయిన్ రాశీ ఖన్నాపై గుర్రుగా ఉన్నారు. రాశీఖన్నాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వరుస పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది.

దీంతో ఈ వార్త అటు ఇటు చేరి ఫైనల్ గా రాశీ చెవిన పడ్డింది. అంతే సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా..ఆ ఫేక్ వార్తలను ఖండించింది. దక్షిణాది చిత్ర పరిశ్రమను తాను దూషించానంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని రాశీ ఖన్నా అన్నారు. తనపై జరుగుతున్న విద్వేష ప్రచార వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఆమె ఓ పోస్ట్ చేశారు. ఏ చిత్ర పరిశ్రమ అయినా… తాను చేసే ప్రతి సినిమాపై తనకు ఎంతో గౌరవ మర్యాదలు ఉంటాయని చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం చేయడాన్ని ఆపాలని కోరారు. అయితే రాశీ ఖన్నా కి లేట్ గా రియాక్ట్ అయ్యిందని..ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని..ఇక అమ్మడికి తెలుగులో అవకాశాలు రావు అని..చక్క భజనే కరెక్ట్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news