Moviesఇదంతా బన్నీ వల్లే..ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్ చేసిన అలియా..!!

ఇదంతా బన్నీ వల్లే..ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్ చేసిన అలియా..!!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద సృష్టించిన సునామీ ఏంటో మనం కళ్లారా చూశాం. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 17న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేనా బన్నీ కెరీర్లో ఇప్పటి వరకు ఎక్కువ లాభాలు తెచ్చి పెట్టిన సినిమాగా నిలిచింది. బన్నీ యాస్టింగ్ రష్మిక అందాలు సుకుమార్ డైరెక్షన్ వల్ల ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. దానికి తగ్గట్లుగానే కలెక్షన్స్ కూడా వచ్చాయి. అఫీషియల్ గా 300 కోట్ల గ్రాస్ ఈ సినిమా వసూలు చేసిందని నిర్మాతలు ప్రకటించారు . అయితే పుష్ప సినిమాకు కలెక్షన్స్‌తో పాటు ప్రశంసలు కూడా అలాగే వస్తున్నాయి. బడా బడా స్టార్స్ ఈ సినిమాలో బన్నీ నటనను చూసి బాగ అమెచ్చుకున్నారు. ఆయనతో కలిసి సినిమా చేయాల్ని..ఆశపడుతున్నారు.

ఈ లిస్ట్ లో బాలీవుడ్ బ్యూతీ అలియా కూడా ఉంది. పుష్ప సినిమా చూసి అల్లు అర్జున్ కి బిగ్ ఫ్యాన్ అయిపోయానని..మా ఫ్యామిలీ మొత్తం పుష్ప సినిమాని బాగా ఎంజాయ్ చేశారు అని..బన్నీ తో నటించే అవకాశం వస్తే ఖచ్చితంగా నటిస్తా అంటూ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చింది. కాగా ఇప్పుడు మరోసారీ బన్నీ పేరు చెప్పుతూ..ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్ చేసింది. RRR సూపర్ సక్సెస్ సంధర్భంగా ఓ ఇంటర్వ్యుల్లో పాల్గొన్న ఆమె ..ఆమె ముందు చిత్రం గంగూబాయ్ క‌తియావాడి స‌క్సెస్ గురించి కూడా మాట్లాడారు.

అప్పుడు మాటల సంధర్భంలో అస‌లు ఆమె ఈ సినిమాలో అంత బాగా నటించదానికి కారణం బన్నీ అంటూ చెప్పి షాక్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ..”డైరెక్టర్ స్టోరీ చెప్పిన్నప్పుడు.. ఆ క్యారెక్ట‌ర్‌ లో నేను జనాలను మెప్పించలగలనా అని అనుకున్నాను. భయపడాను. ప్రేక్ష‌కుల‌కు ఎలా క‌నెక్ట్ అయ్యేలా చేయాలో నాకు అవ‌గాహ‌న లేదు. డైరెక్ట‌ర్ చెప్పిన స్క్రిప్ట్ బావున్నా కూడా న‌టిగా బాడీ లాంగ్వేజ్‌లో ఓ కొత్త‌దనాన్ని చూపిస్తే కానీ విజ‌యం సాధించ‌లేమని అనుకున్న.

అప్పుడు నేను అల్లు అర్జున్ హీరోగా న‌టించిన పుష్ప సినిమా చూశా. ఆ సినిమా లో పుష్ప బాడీ లాంగ్వేజ్‌..సినిమా కోసం ఆయన పెట్టిన ఎఫర్ట్స్ చూసి షాక్ అయ్యాను. అప్పుడే డిసైడ్ అయ్యాను . నేను ఇలానే చేయాలని. దాన్ని చూసిన త‌ర్వాత నేను నా క్యారెక్ట‌ర్ కూడా మాస్‌గా ఉండాల‌ని డిఫ‌రెంట్‌గా ట్రై చేశా. ఫైనల్లీ ఆ మార్పుతో నన్ను నేను న‌ట‌న‌లో కొత్త కోణం క‌నిపించింది” అంటూ చెప్పుకొచ్చింది. అలా ఆలియా భ‌ట్ త‌న స‌క్సెస్ సీక్రెట్‌ను రివీల్ చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news