Movies# NBK 107 అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చేసింది... న‌ట‌సింహం ఫ్యాన్స్‌కు బంప‌ర్...

# NBK 107 అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చేసింది… న‌ట‌సింహం ఫ్యాన్స్‌కు బంప‌ర్ న్యూస్‌

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ అఖండ త‌ర్వాత త‌న స‌క్సెస్ కంటిన్యూ చేసేలా ప్లానింగ్‌తో దూసుకు పోతున్నారు. ఆయ‌న కెరీర్‌లో 107వ సినిమాగా… క్రాక్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య 108 కూడా అనిల్ రావిపూడితో క‌మిట్ అయిపోయాడు. ఇక బాల‌య్య 107 ప్రాజెక్టు షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

మైత్రీ మూవీస్ వాళ్లు భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అఖండ త‌ర్వాత వ‌స్తోన్న బాల‌య్య సినిమా కావ‌డంతో పాటు.. భారీ అంచ‌నాలు ఉండ‌డంతో అటు మైత్రీ వాళ్లు… ఇటు గోపీచంద్ చాలా ప‌గ‌డ్బందీగా సినిమా కోసం ఎక్క‌డా రాజీప‌డ‌డం లేదు. ఫ‌స్ట్ షెడ్యూల్ తెలంగాణ‌లోని సిరిసిల్ల జిల్లాలో స్టార్ట్ అయ్యింది. అక్క‌డ ఫ‌స్ట్ యాక్ష‌న్ ఎపిసోడ్‌తోనే సినిమాను స్టార్ట్ చేశారు.

ఆ త‌ర్వాత హైద‌రాబాద్ సమీపంలో ఓ చిన్న షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ఇక ఈ రోజు నుంచి సినిమా రామోజీ ఫిల్మ్‌సిటీకి మారింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసిన‌ట్టు మేక‌ర్స్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. బాల‌య్య‌కు జోడీగా అందాల తార శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో విల‌న్‌గా క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ న‌టిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం ముస‌ళ్ల‌మ‌డుగు ప్ర‌తాప్ రెడ్డిగా దునియా విజ‌య్ ప‌వ‌ర్ ఫుల్ లుక్ కూడా రిలీజ్ అయ్యింది. థ‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు రామ్ – ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్స్ ఫైట్ మాస్ట‌ర్లుగా ఉన్నారు. ఇక గ‌తంలో ఈ సినిమా క‌న్న‌డ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మఫ్టీ అనే యాక్షన్ థ్రిల్ల‌ర్‌కు రీమేక్ అన్న వార్త‌లు వ‌చ్చినా.. అందులో నిజం లేద‌ని కూడా తెలుస్తోంది.

ఇక ఈ సినిమా గురించి బాల‌య్య ఫ్యాన్స్ పండ‌గ చేస్కొనే న్యూస్ ఏంటంటే ద‌స‌రాకే ఈ సినిమాను థియేట‌ర్ల‌లోకి దింపుతున్నారు. షూటింగ్ కూడా గ్యాప్ లేకుండానే పూర్తి చేసేసి ద‌స‌రాకు రిలీజ్ ప్లానింగ్ జ‌రుగుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news